rambabu fire

కూటమి సర్కార్‌పై అంబటి ఆగ్రహం

కూటమి సర్కార్ పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని, అలాంటి వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామ‌ని అంబ‌టి రాంబాబు హెచ్చ‌రించారు. కూట‌మి ప్ర‌భుత్వం సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌పై న‌మోదు చేస్తున్న అక్ర‌మ కేసులు, అరెస్టుల‌పై అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను వందకు పైగా కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నారు. మా వాళ్ల‌ను అరెస్టు చేశారు మ‌రి టీడీపీ సోష‌ల్ మీడియా వాళ్లు చాలా దారుణంగా వైయ‌స్ జ‌గ‌న్ గారి కుటుంబ స‌భ్యుల‌పై, నాయకులపై దారుణంగా పోస్టులు పెట్టారు. మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేద‌ని అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు

వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెడుతున్నారని అంబటి ఆరోపించారు. తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆయన ఫిర్యాదు చేశారు. త జగన్‌తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐటీడీపీ అనే పేరుతో అసభ్య పోస్టులు పెడుతున్నారన్నారు. ఈ నెల 17వ తేదీ నుండి మూడు రోజుల పాటు అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవన్నారు. కానీ వైసీపీ క్యాడర్ పై మాత్రం 300 కేసులు నమోదు చేశారని చెప్పారు.

టీడీపీ నాయకుల చెప్పుచేతల్లో పోలీస్ వ్యవస్థ పని చేస్తున్నట్లు కనబడుతోందని మండిపడ్డారు. ఇలానే పోలీసులు వ్యవహరిస్తే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. తాము ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు ఎవరు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

Related Posts
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎల్లుండికి వాయిదా..
AP Assembly Sessions Postponed to Wednesday

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడింది. మొదటి రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం వెంటనే వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-2025 Read more

సీఎం చెప్పినవన్నీ డొల్లమాటలే – కేటీఆర్
ktr revanth

వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్య మంత్రివన్నీ డొల్లమాటలేనని సీఎం రేవంత్ ఫై కేటీఆర్ విమర్శించారు. 2 లక్షల రుణమాఫీ పూర్తయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక Read more

అదానీపై US కోర్టు కేసులో ఊహించని ట్విస్ట్
adani news

అదానీపై అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో మరో టర్న్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్పై US DOJ లంచం, అవినీతి అభియోగాలు నమోదే చేయలేదని Read more

షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్
షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్

బంగ్లాదేశ్ నుండి పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో షేక్ హసీనాను అప్పగించాలని వచ్చిన అంశం పై ఈ చర్య తీసుకోబడింది. అయితే, హసీనాకు ఆశ్రయం ఇచ్చారు అన్న వాదనలను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *