బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా, “కాంగ్రెస్ పాలన రాష్ట్రాన్ని వణికించుకుంటూ, ధర్నాల ద్వారా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు” అని మండిపడ్డారు. “మూలకున్న ముసలవ్వ నుంచి బడిపిల్లల వరకు, అన్ని వర్గాల ప్రజలు ఈ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, అందరూ కాంగ్రెస్ పాలనను నిరసిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదిక ట్విటర్ (X)లో రాసుకొచ్చి, కాంగ్రెస్ పై తన నిరసనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బహిరంగంగా వ్యక్తపరిచారు.
బెటాలియన్ కానిస్టేబుళ్ల దుర్భర పరిస్థితిపై వారి కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. నిన్నటి దాకా బెటాలియన్ ఎదుట ధర్నా చేసిన కానిస్టేబుళ్ల భార్యలు ఇవాళ రాష్ట్ర సచివాలయం ఎదుట నిరసనలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున హైదరాబాద్ చేరుకుని సెక్రటేరియట్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ భర్తలను కూలీల కంటే హీనంగా చూస్తున్నారని.. వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు.
దద్దమ్మ పాలనలో ధర్నాలతో దద్దరిల్లుతున్న తెలంగాణ రాష్ట్రం
దిక్కుమాలిన పాలనలో దిక్కుమొక్కు లేని జీవితాలు
అలంపూర్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు
గ్రామ సచివాలయం నుండి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు
రైతు నుండి మొదలు రైస్ మిల్లర్ల వరకు*
కార్మికుని నుండి మొదలు కాంట్రాక్టర్ల వరకు… pic.twitter.com/x352EIVdOg— KTR (@KTRBRS) October 25, 2024