bandi musi

కాంగ్రెస్ ప్రభుత్వం పై బండి సంజయ్ కీలక ఆరోపణలు

కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్.. మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.మీడియాతో మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని కూడా ఏటీఎంలా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంద”ని విమర్శించారు.

మూసీ ప్రక్షాళన పేరుతో పరివాహక ప్రాంతంలోని నిరుపేదల ఇళ్లను కూల్చివేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల అప్పు తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, “వడ్డీల రూపంలో పది నెలల్లోనే రూ.60 వేల కోట్లు చెల్లించామని” వివరించారు. “పాలకులు చేస్తున్న అప్పుల కారణంగా రాష్ట్రంపై, ప్రజలపై భారం పడుతోంది” అని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు సహా హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్పారు.

బీజేపీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా లేదని, అయితే “ఈ ప్రభుత్వ దోపిడీ, హైడ్రా పేరుతో పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రం తాము వ్యతిరేకమ”న్నారు. ఈ పరిస్థితులను నిరసిస్తూ రేపు ఇందిరా పార్క్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Related Posts
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు KCRను ఆహ్వానిస్తాం: పొన్నం ప్రభాకర్
ponnam fire

తెలంగాణ రాష్ట్రంలో గౌరవప్రదమైన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్లు Read more

తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు..
Vaastu changes at Telangana Secretariat

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నారు. సచివాలయానికి తూర్పు వైపున ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసివేస్తున్నారు. దాదాపు రూ.3 కోట్ల 20 లక్షల వ్యయంతో వాస్తు Read more

CMR కాలేజీ కేసు: ఎఫ్‌ఐఆర్‌లో మల్లారెడ్డి సోదరుడి పేరు
CMR కాలేజీ కేసు: ఎఫ్‌ఐఆర్‌లో మల్లారెడ్డి సోదరుడి పేరు

ఇటీవల CMR కాలేజీ హాస్టల్ లో బాత్రూంలో కెమెరా ఏర్పాటు చేసిన కేసులో, మేడ్చల్ పోలీసుల దర్యాప్తులో నిందితులుగా హాస్టల్ వంటగది సిబ్బంది నంద కిషోర్ కుమార్ Read more

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25..మీ నిజమైన ఏఐ సహచరుడు: టిఎం రోహ్
Samsung best smartphone, the Galaxy S25: Your true AI companion: TM Roh

న్యూఢిల్లీ: గెలాక్సీ ఎస్25 అనేది కెమెరా మరియు బ్యాటరీ కోసం హార్డ్‌వేర్‌లో సాటిలేని నాయకత్వంతో వస్తున్న అతి సన్నటి మరియు అత్యంత మన్నికైన స్మార్ట్‌ఫోన్. ఇది గెలాక్సీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *