NEW PHC

ఏపీలో కొత్తగా 88 పీహెచ్సీలు

ఏపీలో 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ పార్లమెంటులో తెలిపారు. PHCల్లో 72 మంది స్టాఫ్ నర్సులకు 68 మందిని, 45 మంది వైద్యులకు 42 మందిని నియమించినట్లు చెప్పారు. జిల్లా అర్బన్ పీహెచ్సీల్లో 97 మంది స్టాఫ్ నర్సులకు 86 మందిని, 49 మంది వైద్యులకు 48 మందిని నియమించినట్లు వెల్లడించారు.

ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలో మొత్తం 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి) లు ఏర్పాటు చేయ‌నుండ‌గా, ఎన్టీఆర్ జిల్లాలో రెండు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం ల‌భించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ స‌హాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

టీడీపీ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల గురించి అడిగిన ప‌లు ప్రశ్నల‌కు శుక్ర‌వారం కేంద్ర స‌హాయ మంత్రి బదులిచ్చారు. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHCs) 72 మంది స్టాఫ్ న‌ర్సులకి ఆమోదం ల‌భించ‌గా ప్ర‌స్తుతం అందుబాటులో 68 మంది స్టాఫ్ న‌ర్సులను నియ‌మించిన‌ట్లు తెలిపారు. డాక్ట‌ర్ల విష‌యానికి వ‌స్తే 45 మంది డాక్ట‌ర్స్ కి ఆమోదం ల‌భిస్తే ప్ర‌స్తుతం అందుబాటులో 42 మంది డాక్ట‌ర్ల నియామ‌కం జ‌రిగింద‌న్నారు. జిల్లాలోని ఈ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన వైద్యుల నియామ‌కం జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు.

Related Posts
హాస్టళ్లలో భోజనంపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
cm revanth reddy district tour

హాస్టళ్లలో భోజన వసతులపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీచేసింది. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలోనేడు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల బాగోగుల పట్ల కీలక నిర్ణయాలు తెలిపారు. Read more

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించిన ఆప్
ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించిన ఆప్

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ అంచనాలను పూర్తిగా తిరస్కరించింది. Read more

ఏపీలో అందుబాటులోకి వచ్చిన రూ.99 ల క్వార్టర్ మందు
99 rs

ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగా తాజాగా మందుబాబుల కోరిక కూడా తీర్చాడు. ఇటీవలే కొత్త Read more

హైదరాబాద్​లో పెరుగుతున్న ఫుడ్​ పాయిజనింగ్ కేసులు
Food poisoning

హైదరాబాద్ మహానగరంలో చాలామంది ఇంట్లో తినడం మానేశారు. బిజీ లైఫ్ కు అలవాటు పడిపోయి..వంట చేసుకొని తినే బదులు , వంద పెట్టి బయట తింటే సరిపోతుందికదా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *