Free gas cylinder guarantee scheme to be implemented in AP from today

ఏపీలో ఈరోజు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు

అమరావతి: ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని నవంబర్ 1వ తేదీ శుక్రవారం నుంచి అమలులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఇది ఒక ముఖ్యమైన భాగం.

కాగా, శుక్రవారం ఈ పథకాన్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఈదుపురంలో సందర్శించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభిస్తారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో చర్చలు జరుపుతారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే చేశారు.

ఇకపోతే.. ఉచిత గ్యాస్ కోసం రాష్ట్రంలో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అర్హులైన ప్రజలకు ఉచిత గ్యాస్ అందించబడుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీపం-2 పథకానికి అనుగుణంగా ఉచిత సిలిండర్లు అందించబడనున్నాయి. ప్రతి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పేదలపై గ్యాస్ భారాన్ని తగ్గించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ఉచిత సిలిండర్లను నాలుగు నెలల వ్యవధిలో ఒకటి చొప్పున పంపిణీ చేయనున్నది.

Related Posts
గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కొరకు డీమ్డ్ యూనివర్శిటీ అప్లికేషన్స్
Deemed University inviting applications for undergraduate programmes

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ యూనివర్శిటీగా పేరుతెచ్చుకున్న సింబయాసిస్ ఇంటర్నేషనల్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కొరకు అప్లికేషన్స్ ను ఆహ్వానిస్తోంది. సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ Read more

కర్నూలుకు ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్
Ferty9 brings the highest standard of fertility care to Kurnool

కర్నూలు : దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ సంతానోత్పత్తి సంరక్షణ నెట్‌వర్క్ గా గుర్తింపు పొందిన ఫెర్టీ9 ఫెర్టిలిటీ సెంటర్, కర్నూలులో తమ అధునాతన సౌకర్యాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. Read more

రాజ్యాంగాన్ని రాజకీయాల నుండి దూరంగా ఉంచాలి: ఓమ్ బిర్లా
om birla 1

లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా గారు ఇటీవల రాజ్యాంగాన్ని రాజకీయాల నుండి దూరంగా ఉంచాలని సూచించారు. ఆయన మాటల ప్రకారం రాజ్యాంగం ఒక కేవలం చట్టపరమైన Read more

తెలంగాణ స్కూల్స్ లలో ఏఐ టెక్నాలజీ
ai technology

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యలో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, విద్యారంగాన్ని ఆధునికీకరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో, రాష్ట్రంలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *