CM Chandrababu launched the free gas cylinder scheme

ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈరోజు ప్రారంభమైంది. దీపం 2 పథకంలోని భాగంగా సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈదుపురంలో మహిళా లబ్దిదారులలో ఒకటైన శాంతమ్మ ఇంటికి చంద్రబాబు వెళ్లి ఆమెకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించారు. అనంతరం జానకమ్మ అనే ఒంటరి మహిళకు పింఛన్ అందజేశారు. సీఎం తన ఇంటికి రావడంతో జానకమ్మ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

జానకమ్మ సీఎం చంద్రబాబుకు తన సొంత ఇల్లు కట్టించమని కోరారు. ఇందుకు సీఎం హామీ ఇచ్చి.. రేపటి నుంచే మీ ఇంటి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు కూడా దీనిపై ఆదేశాలు ఇచ్చారు. డ్వాక్రా కార్యక్రమంలో లీడర్‌గా ఉన్నావు కాబట్టి పది రూపాయలు సంపాదించుకోవాలి అని సీఎం జానకమ్మకు సలహా ఇచ్చారు. థైరాయిడ్, డయాబెటిక్ ఉన్న వారికి జనరిక్ మందులు అందుబాటులో ఉంటే చూడాలని కలెక్టర్‌ను సూచించారు. జానకమ్మ మాట్లాడుతూ.. “నేను రూ.500 నుంచి రూ.4000 వరకు అందుకుంటున్నాను. మీరు మాకు దేవుడు” అని సీఎం చంద్రబాబుకు తెలిపారు. 20 సంవత్సరాలుగా పేదరికంలో మగ్గుతున్నామని ఆమె చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి ద్రబాబు ఆమెను ఓదార్చారు.

Related Posts
జీవాంజి దీప్తిని అభినందించిన చిరంజీవి
chiranjeevi-congratulates-paralympics-medalist-deepti

పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన జీవాంజీ దీప్తి ప్రతిభకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్‌లో గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీ Read more

బుడంపాడు నారాకోడురు రహదారిపై ఘోరప్రమాధం
బుడంపాడు నారాకోడురు రహదారి పై ఘోర ప్రమాధం

బుడంపాడు నారాకోడురు రహదారిపై ఘోరప్రమాధం.ఆటోని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం. సంఘటన స్థలంలోనే మృత్యువాత పడిన ముగ్గురు కూలీలు...ఆటోని ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం.సంఘటన Read more

బోరుబావిలో చిన్నారి: శ్రమిస్తున్న అధికారులు
boy

రాజస్థాన్: డిసెంబర్ 11, పెద్దల నిర్లక్ష్యంతో పసి పిల్లల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. నీటి కోసం పొలాల్లో బోరుబావులు గోతులు తీసి నీరు పడకపోతే మల్లి వాటిని Read more

టీవీ-5 అధినేత బీఆర్‌ నాయుడికి సీఎం చంద్రబాబు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్‌ పదవి;
TTD

23 మంది సభ్యులతో కూడిన టీటీడీ బోర్డు ముగ్గురు ఎమ్మెల్యేలకు అవకాశం సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్‌: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) నూతన బోర్డు సభ్యులను ప్రకటించారు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *