WhatsApp Image 2024 11 11 at 10.56.56

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..నేడు కీలక బిల్లును ప్రవేశపెట్టనున్న పవన్ కల్యాణ్

అమరావతి: రెండో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం అయింది. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అయితే కాసేపట్లో అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కీలక బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో అసెంబ్లీలో పంచాయతీరాజ్ బిల్లు-2024 ను పెట్టేందుకు పవన్ కల్యాణ్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులను సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024 ను పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు సన్నాహాలు పూర్తి చేశారు.

కాగా, అసెంబ్లీ సమావేశాల్లో ఈ మూడు బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఈ నెల 22 వరకు సమావేశాలు కొనసాగించాలని అసెంబ్లీ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. అయితే ఒకపూటే సమావేశాలు నిర్వహించాలని, బిల్లులు, పలు అంశాలపై చర్చలు జరిపినప్పుడు సాయంత్రం వరకూ సభ నిర్వహించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. మొత్తం సమావేశాల్లో 8 బిల్లులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తులు చేసింది.

Related Posts
జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళుతున్న JBT ట్రావెల్స్ బస్సు, రోడ్డు మీద Read more

మణిపూర్‌లో హింసాత్మక నిరసనలు
Ongoing Clashes in Manipur

భారతదేశం యొక్క ఈశాన్యభాగాన ఉన్న రాష్ట్రమైన మణిపూర్‌లో ఆరుగురు మహిళలు మరియు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిమీద అపహరణ చేసి హత్య చేసినట్లు మెయ్‌టై సమాజం సభ్యులు Read more

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటించిన తెలంగాణ సర్కార్‌
Telangana government announced Diwali bonus for Singareni workers

హైరదాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు దీపావళి ప్రత్యేక బోనస్ ప్రకటించింది. ఈ బోనస్ ద్వారా సర్కార్ రూ. 358 కోట్లు విడుదల చేసింది. ఈ Read more

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు
pvsindhu wedding

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాదుకు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఆమె ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *