lokesh us

అమెరికా పర్యటనకు వెళ్తున్న మంత్రి లోకేష్ ..షెడ్యూల్ ఇదే

నారా లోకేశ్ ఈ నెల 25వ తేదీ నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. ఆ పర్యటనలో ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యం. ఈ సందర్శనలో, 29న లాస్‌వెగాస్‌లో జరుగనున్న ‘సినర్జీ’ అనే ఐటీ సర్వ్ అలయెన్స్ సమావేశానికి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సమావేశంలో 3 వేల చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, మరియు రాజకీయ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ముఖ్యంగా, మంత్రి లోకేశ్ పాలనలో సాంకేతికతను సమర్థంగా ఉపయోగిస్తున్నారని, డిజిటల్ ఆవిష్కరణలకు మద్దతు ఇస్తున్నారని సినర్జీ సంస్థ అభివర్ణించింది.

అమెరికా కాలమానం ప్రకారం లోకేష్ పర్యటన వివరాలు చూస్తే..

25-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిధులతో భేటీ.
పెట్టుబడిదారులు, ఎంటర్ ఫ్రెన్యూర్స్‌తో సమావేశం.

26-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)

పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ.
భారత కాన్సులేట్ జనరల్‌తో భేటీ.
ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో సమావేశాలు.

27-10-2024 (ఆస్టిన్)

ఆస్టిన్‌లోని పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ.

28-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)

రెడ్ మండ్‌లో మైక్రో సాఫ్ట్ ప్రతినిధులతో భేటీ.

29-10-2024 (లాస్‌వెగాస్)

ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరు, అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీలు.
ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో కీలకోపన్యాసం.

30-10-2024 (శాన్‌ఫ్రాన్సిస్కో)

గూగుల్ క్యాంపస్ సందర్శన.
స్టార్టప్స్, ఎంటర్ ప్రెన్యూర్స్‌తో భేటీ.
ఇండియన్ సిజి, కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం
సేల్స్ ఫోర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ.

31-10-2024 (జార్జియా)

జార్జియా కుమ్మింగ్స్‌లోని శానిమౌంటేన్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.

1-11-2024 (న్యూయార్క్)

న్యూయార్క్‌లో పెట్టుబడిదారులతో సమావేశం.

Related Posts
అంబేద్కర్‌అభయ హస్తం ఎక్కడ..? కాంగ్రెస్ కు కేటీఆర్ సూటి ప్రశ్న
KTR direct question to Cong

తెలంగాణలో ప్రజల స్వేచ్ఛను కాంగ్రెస్ పార్టీ హరిస్తున్నట్లు పేర్కొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండేట్ కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ Read more

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు
SC, ST case against Infosys co founder Chris Gopalakrishna

బెంగళూరు : ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం సహా మరో 16 Read more

కశ్మీర్‌లో విద్యుత్ లోటు: ఇండస్ వాటర్ ఒప్పందం పై విమర్శలు
kashmir power cut

కశ్మీర్‌లో ప్రజలు ఎదుర్కొనే శాశ్వత విద్యుత్ విరామాలు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. ముఖ్యంగా చలికాలంలో నీటి స్థాయిలు పడిపోవడం వలన, ఈ సమస్య తీవ్రతరంగా ఏర్పడింది. Read more

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి షర్మిల అభినందనలు
revanth sharmila

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా చేసిన ఈ పోస్ట్‌లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *