samantha on naga chaitanya and shobhita dhulipala relation

అదే నా జీవితం తారుమారుచేసింది..ఇన్నాళ్లకు అసలు నిజాని బయటపెట్టిన సమంత..

సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఆమె చెప్పిన మాటలు కొందరి దృష్టిలో ఆమె విడాకుల విషయానికి సంబంధించి పరోక్షంగా సూచిస్తున్నట్లు భావిస్తున్నారు. సమంత తెలుసి గాని తెలియక గాని చేసిన ఈ కామెంట్లు ఆమె వ్యక్తిగత జీవితం పై పలు అభిప్రాయాలను రేకెత్తించాయి ఇప్పుడు మరొక పెద్ద షాక్ ఏమిటంటే నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల త్వరలోనే వివాహం చేసుకోనున్నారని వస్తున్న వార్తలు. ఈ విషయంపై అభిమానులు సోషల్ మీడియాలో విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది నాగచైతన్యను విమర్శిస్తూ “సమంతతో ఆయన అన్యాయం చేశాడు” అని అంటున్నారు మరి కొంతమంది నాగచైతన్య గురించి “సమంత పీడ విరగడ అయింది” అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఇదే సమయంలో సమంత తన కెరీర్‌లో కీలకమైన ప్రాజెక్ట్ అయిన “సిటాడెల్” వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఎంతో కష్టపడుతూ ఉండడం గమనార్హం. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ప్రమోషన్‌లలో సమంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బాలీవుడ్ మీడియాతో ఇంటర్వ్యూలో సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన “నిజ జీవితంలో మీరు స్పైలా ప్రవర్తించారా?” అన్న ప్రశ్నకు సమంత చాలా బోల్డ్ గా సమాధానం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ, “అలా చేసుంటే బాగుండేదేమో! నా జీవితంలో నేను స్పైగా ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఇకపై స్పైలా ఉండాలని నిర్ణయించుకున్నాను” అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

సమంత చేసిన ఈ వ్యాఖ్యలను చాలా మంది నాగచైతన్యకు సంబంధించిన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు అని అభిప్రాయపడుతున్నారు. “నాగచైతన్య పై నిఘా పెట్టి ఉంటే నా జీవితం ఇలా అయిపోయి ఉండేది కాదు” అని ఆమె చెప్పినట్లు భావిస్తున్నారు కొంతమంది అభిమానులు కూడా దీనిని స్ఫూర్తిగా తీసుకుని సమంతకు మద్దతు ఇస్తున్నారు. “సమంత నాగచైతన్యపై పూర్తి నమ్మకంతో ఉండడమే ఆమె జీవితంలో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం” అంటూ సమర్థిస్తున్నారు ఈ నేపథ్యంలో సమంత చేసిన ఈ ఒక్క కామెంట్ ఆమె విడాకుల విషయాన్ని మరింత హైలైట్ చేసింది.

Related Posts
మళ్లీ అదరగొట్టేసిన విజయ్ సేతుపతి..
Vidudala 2 movie

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషా బేరయెరిగినప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు ఆయన. Read more

సీఎం ఆఫర్‌ తిరస్కరించా : సోను సూద్‌
Rejected the CM's offer.. Sonu Sood

ముంబయి : బాలీవుడ్‌ స్టార్‌ నటుడు, రియల్‌ హీరో సోను సూద్.. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి తనవంతు Read more

ఓటీటీలోకి క‌న్న‌డ డిజాస్ట‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ
martin movie

కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మార్టిన్ ఇటీవలే థియేటర్లలో విడుదలైనప్పటికీ, ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. సీనియర్ హీరో అర్జున్ కథను అందించిన ఈ చిత్రంలో ధృవ్ సర్జా ప్రధాన Read more

హిట్ స్టేటస్కు అత్యంత దగ్గరగా విశ్వం.. ఆ ముగ్గురి టార్గెట్ కంప్లీట్ అయినట్లేనా
viswam

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా, మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కావ్య దాపర్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన సినిమా విశ్వం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *