ఫేస్ టోనర్స్ అనేవి చర్మానికి ప్రత్యేకమైన ద్రవాలు, ఇవి ముఖాన్ని శుభ్రపరచడంలో మరియు న్యూట్రిషన్ అందించడంలో సహాయపడుతాయి. టోనర్ ఉపయోగించడం ద్వారా చర్మం ఎక్కువ నిగనిగలాడుతుంది. చర్మం ఆరోగ్యంగా మరియు ఉల్లాసంగా కనిపిస్తుంది.
టోనర్ యొక్క ప్రయోజనాలు
- టోనర్లు ముఖంపై మేకప్, మురికి ని తొలగిస్తాయి. ఇది మొఖాన్ని శుభ్రంగా కడిగాక ఉపయోగించడం ద్వారా చర్మాన్ని మరింత శుభ్రంగా ఉంచుతుంది.
- కొన్ని టోనర్లు నేచరల్ పదార్థాలతో తయారవుతాయి. ఇవి చర్మానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తాయి.
- ముఖాన్ని శుభ్రం చేసిన తర్వాత చర్మపు పీహెచ్ స్థాయిలు క్షీణించడం సాధారణం. టోనర్ ఈ పీహెచ్ స్థాయిని బ్యాలెన్స్ చేసేందుకు సహాయపడుతుంది.
- టోనర్లు చర్మంలోని మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఆల్కహాల్-ఫ్రీ టోనర్లు ప్రత్యేకంగా సున్నితమైన చర్మానికి అనుకూలంగా ఉంటాయి.
టోనర్ ఉపయోగించడం చాలా సులభం:
- ముందుగా ముఖాన్ని శుభ్రం చేయండి.
- కాటన్ పాడ్ ద్వారా టోనర్ ను ముఖంపై నిమిషం పాటు మర్దన చేయండి.
- తర్వాత మీ చర్మానికి అనుకూలమైన మాయిశ్చరైజర్ లేదా సీరమ్ ఉపయోగించండి.
మీ చర్మ రకం ప్రకారం టోనర్ ఎంపిక చేయడం ముఖ్యం. తడిగా లేదా క్రీమీ టోనర్లు డ్రై చర్మం కోసం మంచిది. ఫేస్ టోనర్‌లను మీ రోజువారీ చర్మ నిర్వహణలో చేర్చడం ద్వారా మీరు మీ చర్మానికి ఆరోగ్యాన్ని, అందాన్ని అందించవచ్చు. ఇది చర్మాన్ని కాంతివంతంగా , మరియు మృదువుగా ఉండేలా చేయడంలో ఎంతో సహాయపడుతుంది.