ఈసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టీమ్ ఇండియాకు సవాలుగా మారింది.ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్న వేళ వెటరన్ ఆటగాళ్లు రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు.మెల్‌బోర్న్ టెస్టులో ఈ ఇద్దరి బ్యాట్ నుంచి పరుగులు రాలేదు,వారి ప్రదర్శనపై అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు.రెండో ఇన్నింగ్స్‌లోనూ అతను 9 పరుగులు మాత్రమే చేశాడు.ఇదే విధంగా విరాట్ కోహ్లీ కూడా తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులు చేసి, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 5 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ ఆటతీరుతో జట్టు విజయానికి తోడ్పడడంలో వీరిద్దరూ పూర్తిగా విఫలమయ్యారు.ఈ టెస్టు సిరీస్‌లో రోహిత్, విరాట్ ఆటతీరుపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కొంతకాలంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫామ్‌లో లేరు, దీనితో జట్టు భవిష్యత్తు గురించి చర్చలు మొదలయ్యాయి.ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం, కానీ సీనియర్ ఆటగాళ్లు అంచనాలను అందుకోలేకపోయారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ ఇండియా ప్రదర్శన అసంతృప్తికరంగా ఉండటంతో జట్టులో మార్పులపై డిమాండ్ పెరిగింది.

ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల టెస్టు ఫార్మాట్ నుంచి విరమణ గురించి చర్చలు జరుగుతున్నాయి.రోహిత్, విరాట్ ప్రస్తుతం వారి కెరీర్ చివరి దశలో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ పర్యటన వారు ఆటతీరును ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద అవకాశం, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు.మెల్‌బోర్న్ టెస్టు టీమిండియాకు విజయం అందించాల్సిన కీలకమైన మ్యాచ్. కానీ ఈ మ్యాచ్‌లోని ఈ విఫలత, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకునే భారత ఆశలను దెబ్బతీస్తుంది. రోహిత్, విరాట్ వంటి అనుభవజ్ఞుల ఆటతీరుపై ఆధారపడిన జట్టు ఇప్పుడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. సీనియర్ ఆటగాళ్లు నిరాశపరిచిన వేళ, కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువ ఆటగాళ్లలో ఉన్న శక్తి, ఉత్సాహం జట్టుకు కొత్త జోష్‌ను అందించగలదని అభిమానులు అంటున్నారు.