ktr comments on congress

హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో తనకు సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో డబ్బు చెల్లింపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో ఈరోజు అఫిడవిట్ సమర్పించారు. ఈ-కార్ రేసింగ్ కేసుపై ఏసీబీ విచారణ జరుపుతోంది. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది.

 హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో అనుకూలాలు మరియు కారణాలు హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్

దీంతో కేటీఆర్ ఈరోజు రిప్లై ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఒప్పందం అమలులో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని తెలిపారు. విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై పర్మిషన్‌కు సంబంధించి సంబంధిత బ్యాంకు చూసుకోవాలని అందులో పేర్కొన్నారు.
హెచ్ఎండీఏ సంస్థ పరిగణనలో ఉంటాయి
ఫార్ములా ఈ-కార్ రేస్‌ ను ప్రమోట్ చేసే ముందు చెల్లింపులకు సంబంధించి లీగల్ ఇష్యూస్ హెచ్ఎండీఏ సంస్థ పరిగణనలో ఉంటాయన్నారు. అలాగే రూ.10 కోట్లు దాటే చెల్లింపులకు కేబినెట్ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండీఏ నిబంధనల్లో లేదన్నారు. నగర, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈ వ్యవహారాల్లో తనకు సంబంధం లేదన్నారు.

Related Posts
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశాలు లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, "ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను Read more

ఏప్రిల్ 27కి బీఆర్ఎస్ పుట్టి 25 ఏళ్లు
BRS farmer protest initiation in Kodangal on 10th of this month

తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 27న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా Read more

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు
Yadagirigutta Devasthanam Board on the lines of TTD

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు Read more

మహారాష్ట్ర నుంచి కవాల్ టైగర్ రిజర్వులోకి వచ్చిన పులి..
tiger

తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కవాల్ టైగర్ రిజర్వ్ లో ఒక పులి గమనించబడింది. ఈ పులి మాహారాష్ట్ర నుండి తెలంగాణలోకి చేరుకుంది. నవంబర్ 17, ఆదివారం ఈ సంఘటన Read more