hinachal

హిమాచల్‌ప్రదేశ్ కు ఆరెంజ్‌ అలర్ట్‌

చలి తీవ్రతకు ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. దీనితో ఆరెంజ్‌ అలర్ట్‌ చేసారు. ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అప్రమత్తమైన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను తాత్కాలికంగా మూసివేశారు.
పలు రోడ్లు మూసివేత

Advertisements

హిమాచల్ ప్రదేశ్‌లో మూడు జాతీయ రహదారులు సహా మొత్తం 226 రోడ్లను మూసివేశారు. ఇందులో సిమ్లాలో 123 రోడ్లు, లాహౌల్‌, స్పితిలో 36, కులులో 25 రోడ్లు ఉన్నాయి. 173 ట్రాన్స్‌ఫార్మర్‌లకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో తీవ్రమైన చలి పరిస్థితుల కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.
డెహ్రాడూన్‌లో దట్టంగా మంచు
ఇక ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో త్యుని-చక్రతా-ముస్సోరీ జాతీయ రహదారి, ధరణాధర్-కోటి కనసర్ రహదారి పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. జమ్ము కశ్మీర్‌లోని పలు ప్రదేశాలు చలికి అల్లాడిపోతున్నాయి.

శ్రీనగర్‌లో మైనస్‌ 7 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరో 2 నుంచి 3 డిగ్రీల వరకూ తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు జాగ్రత్తగా వుండాలని, అవసమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Related Posts
చైనాతో ట్రెడ్ వార్, మొదలుపెట్టిన డోనాల్డ్ ట్రంప్..
చైనాతో ట్రెడ్ వార్, మొదలుపెట్టిన డోనాల్డ్ ట్రంప్

"అంతా నా ఇష్టం" అంటున్నారు డొనాల్డ్ ట్రంప్, కానీ ఆ మాటలు ఇప్పుడు ప్రపంచంలో పెద్ద చర్చకు కారణం అవుతున్నాయి. అమెరికా ఫస్ట్ పథకాన్ని అంగీకరించిన ట్రంప్, Read more

BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖరారు..రేసులో తెలంగాణ నేతలు
BJP: బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖరారు..రేసులో తెలంగాణ నేతలు

బీజేపీ దేశ వ్యాప్తంగా తన గౌరవాన్ని నిలబెట్టే క్రమంలో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాబోయే లోక్‌సభ మరియు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ ఆచి Read more

NARENDRA MODI :మోదీతో న్యూజిలాండ్ ప్రధాని భేటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై కామెంట్స్
NARENDRA MODI :మోదీతో న్యూజిలాండ్ ప్రధాని భేటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై కామెంట్స్

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లక్సన్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌పై Read more

Tariffs : వివిధ దేశాలపై ప్ర‌తీకార సుంకాల‌ను ప్ర‌క‌టించిన డొనాల్డ్‌ ట్రంప్
అమెరికాకు ఐఫోన్ల ఎగుమతి:టారిఫ్ ల నుంచి తప్పించుకోవడానికి చర్యలు

Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. భారత్‌ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను అమలులోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ Read more

×