హిందీ వెబ్‌సిరీస్‌లలో విభిన్నంగా నిలిచిన 'పాతాళ్ లోక్'

హిందీ వెబ్‌సిరీస్‌లలో విభిన్నంగా నిలిచిన ‘పాతాళ్ లోక్’

హిందీ వెబ్‌సిరీస్‌లలో విభిన్నంగా నిలిచిన ‘పాతాళ్ లోక్’ ఇప్పుడు రెండో సీజన్‌తో మరింత ఆసక్తికరంగా తిరిగి వచ్చింది.జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ తొలి సీజన్ 2020 మే 15న విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు 2024 జనవరి 17న రెండో సీజన్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. మొత్తం 8 ఎపిసోడ్లతో సీజన్ 2 ఎలా ఉందో చూద్దాం.కథ:ఢిల్లీలోని జమున పార్ పోలీస్ స్టేషన్‌లో హథీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్) పోలీసులు పని చేస్తుంటాడు. నిజం కోసం పోరాడటమే అతని లక్ష్యం.అయితే, నియమాలు ఉల్లంఘించడంలో వెనుకాడడు.

హిందీ వెబ్‌సిరీస్‌లలో విభిన్నంగా నిలిచిన 'పాతాళ్ లోక్'
హిందీ వెబ్‌సిరీస్‌లలో విభిన్నంగా నిలిచిన ‘పాతాళ్ లోక్’

ఈ కారణంగా అతని పై ఉన్న అధికారులు అసహనంతో ఉంటారు.ఒక రోజు గీతా పాశ్వాన్ అనే యువతి తన భర్త రఘు పాశ్వాన్ కనిపించకపోవడాన్ని ఫిర్యాదు చేస్తుంది.అదే సమయంలో నాగాలాండ్‌కు చెందిన రాజకీయ నాయకుడు జొనాథన్ థామ్ ఢిల్లీలో హత్య చేయబడతాడు. ఈ రెండు కేసులను హథీరామ్ పరిశీలించాల్సి వస్తుందిహత్య కేసులో రోజ్ లిజో అనే యువతిపై అనుమానం కలుగుతుంది. రఘు పాశ్వాన్‌తో ఆమెకు సంబంధం ఉందని హథీరామ్ తెలుసుకుంటాడు.హథీరామ్‌తో పాటు అతని సహాయకుడు ఇమ్రాన్ అన్సారీ (ఇష్వాక్ సింగ్) రోజ్ లిజో కోసం నాగాల్యాండ్ వెళ్తారు.థామ్ కుమారుడు రూబెన్ తన తండ్రి హత్యపై ఆవేశంగా ఉంటాడు.హథీరామ్-అన్సారీ దర్యాప్తులో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? రోజ్ లిజో ఎవరు?

ఆమె హత్యకు కారణం ఏమిటి? రఘుతో ఆమె సంబంధం ఏమిటి? అన్నదే కథ.విశ్లేషణ:’పాతాళ్ లోక్ 2‘ రాజకీయ హత్య కేసును సాధారణ వ్యక్తి మిస్సింగ్ కేసుతో ముడిపెట్టి ఆసక్తికరంగా తెరకెక్కించారు.దర్శకుడు రెండు కేసుల మధ్య ఉన్న మిస్టరీను చక్కగా నెరిపాడు.మొదటి సీజన్ ఢిల్లీలో సాగినదిగా ఉంటే,రెండో సీజన్ ఎక్కువగా నాగాల్యాండ్ నేపథ్యంలో ఉంటుంది. ఇది కథనానికి కొత్తదనం అందించింది.పాత్రలు సజీవంగా, సహజంగా చూపించబడినాయి. హథీరామ్ పాత్రలో జైదీప్ అహ్లావత్ ఆకట్టుకున్నాడు.థామ్ కుమారుడి పాత్రలో నటుడు కూడా బాగా న్యాయం చేశాడు. నాగాల్యాండ్‌లో జరిగిన సన్నివేశాలు, స్థానిక సంస్కృతిని బాగా చూపించారు.పోలీస్ అధికారుల ఇగోలను, నేరస్థుల మద్దతుదారులను, బాధిత కుటుంబాలను Director సమతుల్యంగా చూపించారు.నిర్మాణ విలువలు భారీగానే కనిపిస్తాయి.

Related Posts
సంక్రాంతికి వస్తునాం రివ్యూ
సంక్రాంతికి వస్తునాం రివ్యూ

ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మరియు ఎఫ్ 3 లలో విజయవంతమైన సహకారం తరువాత, విక్టరీ వెంకటేష్ చిత్రం సంక్రాంతికి వస్తునం కోసం తిరిగి దర్శకుడు Read more

“బ్రహ్మ ఆనందం” సినిమా – బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసా?
"బ్రహ్మ ఆనందం" సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసా?

బ్రహ్మ ఆనందం' – ఫస్ట్ డే కలెక్షన్స్ విశేషాలు బ్రహ్మ ఆనందం" సినిమా మూవీ అంచనా ప్రకారం 10 CR చేయొచ్చు అని మూవీ మేకర్స్ చెప్తున్నారు. Read more

2nd Show Mazaka Movie Review: సందీప్ కిషన్, రావు రమేష్ హాస్య సినిమా హిట్టా?
మజాకా మూవీ రివ్యూ | Sundeep Kishan Mazaka Movie Highlights

సందీప్ కిషన్, రీతు వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మజాకా’ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివరాత్రి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ Read more

పోగుమ్ ఇదమ్ వేగు తూరమిల్లై – చిన్న బడ్జెట్, సరికొత్త కథతో వచ్చిన సినిమా రివ్యూ
Pogum Idam Vegu Thooramillai

Movie Name: Pogum Idam Vegu Thooramillai Release Date: 2024-10-08 Cast: Vimal, Karunas , Mery Rickets, Aadukalam Naren, Pawan Director:Micheal K Raja Producer: Siva Kilari Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *