pawan HARIHARA

హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్న పవన్

సినీ నటుడు , జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు తో పాటు OG మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు మూవీ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు, మరియు ఎ.ఎం. రత్నం నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ డ్రామా, మరియు 17వ శతాబ్దం నాటి మొగల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతుండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Advertisements

సినిమా కథ పురాతన భారతదేశంలో సాగే ఆత్మవిశ్వాసంతో కూడిన యోధుడి జీవిత చుట్టూ తిరుగుతుంది. హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతమైన యాక్షన్, చారిత్రక సంఘటనలతో ఆకట్టుకుంటారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా..అర్జున్ రాంపాల్ – ఔరంగజేబ్ పాత్రలో, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఇప్ప‌టికే విజ‌యవాడ‌లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన చిత్ర‌బృందం పవ‌న్ క‌ళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీ చివ‌రి షెడ్యూల్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాయిన్ అయిన‌ట్లు చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది.

ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అంటూ ప‌వ‌న్ నిలుచున్న ఫొటోను పంచుకుంది. ఈ మూవీని 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ చిత్రం మొద‌టి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు‌‌.

Related Posts
క్రిస్మస్ వేడుకలలో ప్రపంచ దేశాల ఐక్యత..
christmas

క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కావడంతో, ప్రపంచవ్యాప్తంగా పండుగ సీజన్ మరింత ఉత్సాహంగా మారింది. యేసుక్రీస్తు జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకునే ఈ రోజు, ఆనందం మరియు సద్భావనతో ప్రపంచవ్యాప్తంగా Read more

Rafale Fighter Jet: రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం
రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌తో ఒప్పందం

26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో భారత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణ వర్గాలు బుధవారం వెల్లడించాయి. రూ.63,000 కోట్లకు పైగా విలువైన Read more

telangana budget :తెలంగాణ బడ్జెట్ లో కీలక కేటాయింపులు
తెలంగాణ బడ్జెట్ లో కీలక కేటాయింపులు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ ఉదయం 11:00 గంటలకు శాసనసభలో 2025-26 ఆర్థిక రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే కాంగ్రెస్ Read more

Rahul Gandhi: అమెరికా పర్యటనకు వెళ్లనున్న రాహుల్‌ గాంధీ..!
Rahul Gandhi to visit America.

Rahul Gandhi: ఏప్రిల్‌ 19 నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈసందర్భంగా ఆయన బ్రౌన్‌ యూనివర్శిటీని సందర్శిస్తారు. బోస్టన్‌లో ప్రవాస భారతీయులతోనూ Read more

×