mohan babu 1

స్పందన లేకపోతే మోహన్ బాబును అరెస్ట్ చేస్తాం: పోలీస్ కమిషనర్

సినీ నటుడు మోహన్ బాబు విషయంలో అంతా చట్ట ప్రకారమే జరుగుతోందని… అరెస్ట్ విషయంలో ఆలస్యం లేదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని చెప్పారు. మోహన్ బాబును విచారించేందుకు మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు.
ఇప్పటికే నోటీసులు ఇచ్చాం
మోహన్ బాబుకు తాము ఇప్పటికే నోటీసులు ఇచ్చామని… అయితే ఆయన డిసెంబర్ 24వ తేదీ వరకు సమయం అడిగారని సీపీ చెప్పారు. కోర్టు కూడా ఆయనకు సమయం ఇచ్చిందని తెలిపారు. 24వ తేదీ తర్వాత నోటీసులకు స్పందించకపోతే మోహన్ బాబును అరెస్ట్ చేస్తామని చెప్పారు.
మోహన్ బాబు దగ్గర ఉన్న గన్స్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో లేవని తెలిపారు. ఆయన వద్ద ఉన్న గన్స్ ను చిత్తూరు జిల్లా చంద్రగిరిలో డిపాజిట్ చేశారని చెప్పారు. తాను దాడి చేయడంతో జర్నలిస్టు గాయపడ్డారు కాబట్టి… ఆయనను పరిమర్శించేందుకు మోహన్ బాబు వెళ్లి ఉంటారని తెలిపారు. గత కొంతకాలంగా మంచు మనోజకు, మోహన్ బాబుల మధ్య ఆస్తుల గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కేసులు వేసుకోవడంతో గొడవలు ముదురిపోతున్నాయి.

Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి, ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన Read more

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రివ్యూ..
Srikakulam Sherlock Holmes Review

రేటింగ్: 3/5.. ప్రధాన నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ళ, రవిదర్శకుడు: రచయిత మోహన్నిర్మాత: రమణ రెడ్డిశ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్: వినూత్నతతో కూడిన భావోద్వేగాలకు మణికట్టుసారాంశం: శ్రీకాకుళం Read more

రక్త సంబంధాన్ని మించే అనుబంధం – సీఎం రేవంత్
revanth sister

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విద్యార్థి దశలో గడిపిన చిరస్మరణీయ రోజుల్ని గుర్తు చేసుకుంటూ, వనపర్తిలో అద్దెకు ఉన్న ఇంటిని సందర్శించారు. తన చదువుకునే రోజులలో Read more

పరమేశ్వరుడి రూపంలో అక్షయ్ కుమార్
పరమేశ్వరుడి రూపంలో అక్షయ్ కుమార్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ "కన్నప్ప" షూటింగ్‌ను వేగంగా ముందుకు తీసుకెళుతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా గురించి వరుసగా ఆసక్తికరమైన Read more