diwali crackers

సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే బాణాసంచా కాల్చుకోవాలి – సీపీ

హైదరాబాద్‌లో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడంపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాకాయలు కాల్చుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ప్రకటించారు. టపాకాయలు కాల్చేటప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధేశించిన పరిమితులకు లోబడి ఉండాలని కూడా స్పష్టం చేశారు.

ఈ ఆంక్షలు ఈరోజు నుంచి నవంబర్ 2వ తేదీ వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. రాత్రి 8 గంటల ముందు లేదా రాత్రి 10 గంటల తర్వాత బహిరంగ ప్రదేశాల్లో లేదా పబ్లిక్ రోడ్లపై బాణసంచా కాలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళిని సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

Related Posts
ఉత్తరాయణంలోకి సూర్యుడు
sun uttarayanam

సంక్రాంతి పండుగ రోజు సూర్యుడు ధనస్సు రాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశించడం ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన. దీనిని మకర సంక్రమణ అంటారు. ఈ రోజు Read more

ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు
ఢిల్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో కీలక వాగ్దానాలు

ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చివరి మేనిఫెస్టోని శనివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా విడుదల చేసారు. బీజేపీ అధికారంలోకి Read more

గతంలో బిహార్‌లో పరిస్థితి ఎలా ఉండేదో గుర్తుందా? : నీతీశ్‌ కుమార్‌
.jpg

పాట్నా: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతనిపై సీఎం తీవ్ర Read more

ప్రతి జంట ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలి : చంద్రబాబు
Every couple should have more than two children.. Chandrababu

అమరావతి: ప్రతి ఆడబిడ్డ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలి.. దీనిపై రాబోయే రోజుల్లో మానిటర్ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తాజాగా ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *