గత కొంతకాలంగా సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలు, జర్నలిస్టుపై జరిగిన దాడి వంటి విషయంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబందించిన వివరాలు ఇలా వున్నాయి. ఇటీవల మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు రచ్చకెక్కన సంగతి తెలిసిందే. మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు… మంచు మనోజ్ మరోవైపు… కేసులు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్దకు మీడియా ప్రతినిధులు వెళ్లిన సమయంలో… ఒక జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలతో పాటు పలువురు తీవ్రంగా ఖండించారు.
ఈ కేసులో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టు బెయిల్ ను నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు నిర్ణయాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట లభిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

దాడికి సంబంధించి మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా… ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దీంతో, తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచిచూడాలి.