samsung

సామ్‌సంగ్ గెలాక్సీ భారీ డిస్కౌంట్

ఒక పూట ఆహారం లేకపోయినా జీవించవచ్చు కానీ స్మార్ట్‌ఫోన్‌ చేతిలో లేకపోతే జీవితమే ఆగిపోయినట్లుగా అవుతుంది. మన బలహీనతల్ని ఆసరాచేసుకుని పలు కంపనీన్లు పలు ఆఫర్లు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది జులైలో విడుదలైన ‘సామ్‌సంగ్ గెలాక్సీ ఎం35’ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కస్టమర్లను ఊరించే భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సిరీస్‌లో భాగంగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ బేస్ మోడల్‌ అసలు ధర రూ.19,999 కాగా, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై ఏకంగా రూ.5,000 తగ్గింపు ఆఫర్ లభిస్తోంది. కేవలం రూ.14,999లకే ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కస్టమర్లకు దక్కింది. సామ్‌సింగ్ ‘ఎం సిరీస్’ స్మార్ట్‌ఫోన్లు బాగా పాప్యులారిటీ పొందిన విషయం తెలిసిందే.

Advertisements
samsung


ఆకర్షణీయమైన ఫీచర్లు
ఈ ఫోన్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్‌‌తో 6.62-అంగుళాల డిస్‌ప్లే, ఎగ్జినోస్ 1380 ప్రాసెసర్‌, 1000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, 25 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌, అదనపు ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వంటి ప్రధాన ఫీచర్లు ఉన్నాయి.
పాత స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంచ్ చేయడం ద్వారా అదనపు తగ్గింపును కూడా కస్టమర్లు పొందవచ్చు. అంతేకాదు, కస్టమర్లకు ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. నెలకు రూ.727 చెల్లింపుతో ఫోన్‌ను కొనవచ్చు.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఫోన్ వెనుకవైపు మల్టిపుల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ప్రధానమైనది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 13ఎంపీ కెమెరా ఉన్నాయి.

Related Posts
Om Birla : నినాదాలు రాసి ఉన్న టీషర్టులు ధరించి సభకు రావొద్దు: స్పీకర్‌
Don't come to the House wearing T shirts with slogans on them.. Speaker Om Birla

Om Birla: ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి లోక్ సభకు రావడం పై లోక్ సభ స్పీకర్ ఓంబిర్ల అసహనం Read more

గర్భాన్ని తొలగించుకోవచ్చు: అలహాబాద్ హైకోర్టు
గర్భాన్ని తొలగించుకోవచ్చు: అలహాబాద్ హైకోర్టు

లైంగిక వేధింపులకు గురైన మహిళకు వైద్యపరంగా తన గర్భాన్ని తొలగించుకునే హక్కు ఉందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. 17 ఏళ్ల బాలిక తనకు బిడ్డ కావాలా వద్దా Read more

లేని శాఖకు 20 నెలలు మంత్రిగా పనిచేసిన ఆప్‌ నేత..
AAP leader who worked as a minister for 20 months in a non existent department

గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ విషయం బయటకు న్యూఢిల్లీ: పంజాబ్​లో మంత్రి కుల్దీప్ సింగ్ ధలివాల్ ఇరవై నెలలకు పైగా ఉనికిలో లేని పరిపాలనా సంస్కరణల Read more

ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!
ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే..!

ఢిల్లీలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో బీజేపీ అనూహ్యంగా మంచి ప్రదర్శన చేసింది. మొదట ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆధిక్యంలో ఉన్నా, కౌంటింగ్ Read more

×