drugs3

సంగారెడ్డిలో భారీగా పట్టుబడిన డ్రగ్స్‌

డ్రగ్స్ కంట్రోల్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. తాజాగా సంగారెడ్డిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. న్యూ ఇయర్ దగ్గ రపడుతున్న వేళా డ్రగ్స్ దొరకడం కలకలం సృష్టిస్తున్నది. డ్రగ్స్ ను ఏపీ నుంచి ముంబైకి తరలిస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అలెర్ట్ అయ్యారు.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఓ లారీలో డ్రగ్స్‌ను గుర్తించి వాటిని సీజ్‌ చేశారు. వాటి విలువ రూ.50 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవు నుంచి వాటిని ముంబైకి తరలిస్తున్నారని తెలుస్తున్నది.
పట్టుబడిన డ్రగ్స్‌ను చిరాగ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పరారైన్లు అధికారులు వెల్లడించారు.ఈ తనిఖీల్లో డీఆర్‌ఐ, నార్కొటిక్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ అధికారులు పాల్గొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, దీనివెనక ఎవరున్నారనే విషయమై ఆరాతీస్తున్నారు. న్యూ ఇయర్ సందర్బంగా పెద్ద ఎత్తున ఆంధ్ర, తెలంగాణాలో డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు.

Advertisements
Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి, ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన Read more

పట్టాలు తప్పిన సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్
Secunderabad Shalimar Express derailed

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. నవాల్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు Read more

Telanagana:దశల వారీగా వందే భారత్ రైళ్లకు కసరత్తు
Telanagana:దశల వారీగా వందే భారత్ రైళ్లకు కసరత్తు

దేశవ్యాప్తంగా రైల్వే సేవలను మెరుగుపరచే దిశగా కేంద్ర రైల్వే శాఖ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతోన్న నేపథ్యంలో, సేవలను విస్తరించడానికి ప్రయాణ అనుభవాన్ని Read more

Telangana: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో అనూహ్య పరిణామాలు
Telangana: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో అనూహ్య పరిణామాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సందిగ్ధత నెలకొంది. ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. లిస్టు ఫైనల్ అయినట్లు పార్టీ Read more

×