ravichandran ashwin

అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసిన అశ్విన్‌

టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం క్రికెట్ ప్రపంచాన్ని షాకయ్యేలా చేసింది. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ మధ్యలో అతడు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ నేపథ్యంలో అశ్విన్ రిటైర్మెంట్ గురించి ఆయన సహచర స్పిన్నర్ రవీంద్ర జడేజా తాజా వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.మెల్‌బోర్న్‌లో మీడియాతో మాట్లాడిన జడేజా, అశ్విన్ రిటైర్మెంట్ తనకు పెద్ద షాకిచ్చిందని చెప్పాడు.”ఆ రోజంతా మేమిద్దరం కలిసే గడిపాం.కానీ, రిటైరయ్యే ఐదు నిమిషాల ముందు, ప్రెస్ మీట్‌కు ముందు మాత్రమే ఆయన ఆ విషయం చెప్పారు.అది చాలా ఊహించని విషయం. అతని ఆలోచనా ధోరణి ఎప్పుడూ విభిన్నంగా ఉంటుంది. ఇది జరగబోతుందన్న సూచనలు కొందరు ఇచ్చినా, నేను నమ్మలేదు.

మైదానంలో నాకు మెంటార్‌లా ఉండేవాడు.ఇకపై అతణ్ని చాలా మిస్ అవుతాను,”అని జడేజా ఎమోషనల్‌గా చెప్పాడు. జడేజా ఆపై అశ్విన్‌తో ఉన్న తన ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.”మేము కలిసి బౌలింగ్ చేయడమే కాదు, మైదానంలో పరిస్థితిని అర్థం చేసుకొని తరచూ ఒకరికొకరు సూచనలు పంపించుకునేవాళ్లం. ఇప్పుడు ఆ అనుభవాలన్నింటినీ కోల్పోతాను. టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. అతని స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టం,” అని జడేజా పేర్కొన్నాడు.అయితే, యువ క్రికెటర్లకు ఇది మంచి అవకాశం అని జడేజా అభిప్రాయపడ్డాడు. “వాషింగ్టన్ సుందర్ అతని స్థానానికి సరైన ఎంపికగా కనిపిస్తున్నాడు. భవిష్యత్తులో భారత జట్టు మరింత బలమైన ఆల్‌రౌండర్, బౌలర్‌ను పొందుతుందనే నమ్మకం ఉంది,” అని జడేజా తన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. అశ్విన్ తన టెస్ట్ కెరీర్‌లో 106 మ్యాచ్‌లు ఆడి, 537 వికెట్లను తీసి భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. 37 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించడంతో పాటు, 3,503 పరుగులు చేసి ఆల్‌రౌండర్‌గా తన ప్రతిభను నిరూపించాడు.

Related Posts
కట్‌చేస్తే 10 ఏళ్ల తర్వాత ఘోర పరాజయం
కట్‌చేస్తే 10 ఏళ్ల తర్వాత ఘోర పరాజయం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భారత జట్టు ఘోరంగా ఓడింది.10 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఈ ట్రోఫీని గెలుచుకుంది.ఈ సిరీస్‌లో భారత జట్టు ఎన్నో తప్పిదాలు చేసింది, Read more

ఏం పట్టావ్ భయ్యా క్యాచ్!
ఏం పట్టావ్ భయ్యా క్యాచ్!

హామిల్టన్‌లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 113 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ను 2-0తో తమ ఖాతాలో వేసుకుంది.మ్యాచ్‌లో Read more

బంగ్లా యంగ్ బౌలర్‌తో భారత్‌కు ఇబ్బందే
బంగ్లాయంగ్ బౌలర్‌తో భారత్‌కు ఇబ్బందే

ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో రెండో మ్యాచ్ గురువారం (ఫిబ్రవరి 20) టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనుంది. టోర్నమెంట్‌లో భారత్‌కు నిజమైన సవాలు విసురుతుందనే Read more

టెస్ట్ క్రికెట్‌ లిస్ట్‌లో చేరిన ఆసీస్ నయా సెన్సేషన్..
jasprit bumrah 1 2

భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు పడగొడుతూ,బ్యాటర్లకు పజిల్ లా మారాడు.తన బౌలింగ్ వైవిధ్యంతో బుమ్రా బ్యాట్స్‌మెన్‌ను కష్టంలో Read more