shasanamandali

శాసన మండలిలో నాలుగు బిల్లులు ఆమోదం

హైదరాబాద్ : శాసన మండలి సమావేశాల్లో శనివారం నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనమండలి సమావేశాల్లో స్పెషల్ మెన్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. దీంతో సభ్యులు స్పెషల్ మెన్షన్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం శాసన సభలో ఆమోదం పొందిన మూడు బిల్లులను మండలి ఆమోదం కోసం మండలిలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభారర్ ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రి తరపున మంత్రి శ్రీధర్ బాబు జీహెచ్ఎంసీ 2024 సవరణ బిల్లును. తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు సవరణ 2024ను ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. భూభారతి బిల్లును రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. చర్చ అనంతరం సభ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలోని 80 గ్రామ పంచాయితీలను మున్సి పాలిటీలుగా మారుస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మున్సిపాలిటీ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే ఈసీ ట్రిబ్యునల్ నవరణ మేరకు పంచాయితీ రాజ్ చట్టం పె డ్యూల్ 8 లోని 140 పంచాయితీల సవరణకు వీలు పడేలా పంచాయితీరాజ్ బిల్లును ప్రభుత్వం తీసుకు వచ్చింది. జీహెచ్ఎంసీ వరిధిని విస్తరించేందుకు ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామాలను నగరపాలక సంస్థలో విలీనం చేసేందుకు జీహెచ్ఎంసీ సవరణ బిల్లుకు కూడా శనివారం మండలి ఆమోదం లభించింది. 51 గ్రామాల విలీనంపై పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ సభకు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటెడ్ కమిషన్ వేశామని… దాని వల్ల భవిష్యత్ లో రిజర్వేషన్ల అమలు ఇబ్బంది ఉండదని.. కాంగ్రెస్ మేనిఫెస్టో లో 42 శాతం రిజర్వేష స్లు బీసీలకు కేటాయిస్తమని చెప్పామన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన విధంగా జిత్ నా అబాధి ఉత్న ఇస్తారి ప్రస్తుతం సుప్రీం కోర్టు నిబంధనల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్లు పెంచడానికి రాజ్యాంగ సవరణ చేస్తామని చెప్పాడు. సామాజిక అంశాల విషయంలో రాజకీయ పార్టీలు న హకరించాలని.. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుంది దీనిద్వారా ఎవరెంతో వారికంత సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. పేదవారికి అన్యాయం జరగకుండా అక్రమంగా ఎవరైనా నిర్మాణాలు చేపడితే హైరా చర్యలు తీసుకుంటుందన్నారు. భవిష్యత్ లో అలాంటి పరిస్థితి రాకుండా స్థానికులు ఆక్రమణకు గురైన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. సామాజిక రిజర్వేషన్లపై 50 శాతం నిబంధనలు ఎత్తివేసి రిజర్వేషన్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని సవరణ బిల్లును పెడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సభ్యుల చర్చ అనంతరం మూడు బిల్లులను ఆమోదించారు.

Advertisements
Related Posts
Telangana : నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
New MLCs to be sworn in today

Telangana : ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసనమండలి వేదికగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఈరోజు ప్రమాణ్య స్వీకారం చేయనున్నారు. పట్టభద్రులు, టీచర్‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో Read more

Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ పిటిషన్పై పోలీసుల కౌంటర్
Police counter on bail petition in phone tapping case

Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటలీజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ అఫిడవిట్ Read more

శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Srisailam corridor

హైదరాబాద్-శ్రీశైలం రహదారి మరింత అభివృద్ధి చెందనుంది. ఈ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ప్రయాణ సమయం Read more

ఏపీ సర్కార్ బాటలో తెలంగాణ సర్కార్
TG Inter Midday Meals

తెలంగాణ ప్రభుత్వం..ఏపీ ప్రభుత్వ బాటలో పయనిస్తుందా..? అంటే అవుననే చెప్పాలి. మొన్నటి వరకు తెలంగాణ పథకాలను, తెలంగాణ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను ఏపీ సర్కార్ అనుసరిస్తే..ఇప్పుడు ఏపీలో Read more

×