Gudivada Amarnath

వైసీపీ వల్లే విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ఆగింది : అమర్నాథ్‌

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయడం వల్లే ప్రైవేటీకరణ ఆగిందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు. ప్లాంట్‌ను కాపాడాలని ఉద్దేశ్యం ఉంటే ప్రైవేటీకరణ జరగదని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేయడం వల్లే ప్రైవేటీకరణ ఆగిందని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో శనివారం మాట్లాడారు.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు మొదటి నుంచి వైఎస్‌ జగన్‌ వ్యతిరేకమని తెలిపారు. నిన్న కేంద్రం విశాఖ స్టీల్‌కు ప్రకటించిన రూ. 11,440 కోట్ల ప్యాకేజీ కేవలం ఆక్సిజన్‌లా పనిచేస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చే ప్యాకేజీ కేవలం అప్పులకే సరిపోతుందని వెల్లడించారు. స్టీల్‌ ప్లాంట్‌ అప్పులు కట్టలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. ప్లాంట్‌ను కాపాడాలని ఉద్దేశ్యం ఉంటే ప్రైవేటీకరణ జరగదని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. స్టీల్‌ ప్లాంట్‌కు ట్యాక్స్‌ హాలీడే ఇవ్వాలని, ప్లాంట్‌ను సేయిల్‌లో విలీనం చేయాలని, సొంతంగా గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కూటమి పాలన వచ్చిన తరువాత కార్మికులకు జీతాలు ఇవ్వలేదని, ఉద్యోగులను తొలగించారని ఆరోపించారు.

Related Posts
ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..పలు నిర్ణయాలకు ఆమోదం
AP Cabinet meeting concluded..Approval of many decisions

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 Read more

తల్లికి వందనం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ
తల్లికి వందనం అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు తల్లికి వందనం స్కీమ్ అమలుకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది జూన్ 15 నాటికి ఈ పథకాన్ని అమలు చేస్తామని ఆయన Read more

రూ. 24 కోట్ల నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025లో తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. Read more

రామ్‌చరణ్ సతీమణి ఉపాసన గొప్ప నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన. తన తాత పుట్టిన రోజు సందర్భంగా పెద్ద మనసుతో కీలక ప్రకటన చేశారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *