nara lokesh

వైపీసీవల్లే గ్యారంటీలు ఆలస్యం: లోకేష్

గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే 6 గ్యారంటీలు ఆలస్యం అవుతున్నాయని ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ బకాయిలను తాము చెల్లిస్తున్నామన్నారు. ప్రతి నెల రూ.4 వేల కోట్ల లోటు బడ్జెట్ తో ప్రభుత్వం నడుస్తోందన్నారు. 6 గ్యారంటీల్లో రెండు అమలు చేశామని, మరో రెండు గ్యారంటీలకు డేట్స్ ఇచ్చామన్నారు. 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని లోకేష్ తెలిపారు.


ముందుగా తల్లికి వందనం, రైతు భరోసా
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయినా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ కేబినెట్ భేటీలో ఈ ఏడాది అమలు చేయాల్సిన పథకాలపై కీలక చర్చ జరిగింది. ఇందులో తల్లికి వందనం, రైతు భరోసా ముందుగా అమలు చేయాలని, ఆ తర్వాతే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది కూడా సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ, విద్యామంత్రి నారా లోకేష్ ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు.

మంత్రి నారా లోకేష్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఉండి, కాళ్ళ, భీమవరం ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉండి హైస్కూల్ అభివృద్ధి పనుల్ని లోకేష్ ప్రారంభించారు. అలాగే కాళ్ల మండలం పెద ఆమిరం జువ్వలపాలెం రోడ్ లో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

Related Posts
డయేరియాతో 10 మంది మృతి..చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ లేఖ !
New law in AP soon: CM Chandrababu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, లేఖ రాశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కారణంగా 10 మంది మరణించగా, వందల మంది Read more

పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో వరుస విషాదాలు
Road accident in America. Five Indians died

దీపావళి వేళ తెలుగు రాష్ట్రాల్లో పలు రోడ్డు ప్రమాదాలు ఆయా కుటుంబాల్లో విషాదం నింపాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా.. చింతపల్లి మండలం లంబసింగి ఘాట్ రోడ్డులో ఒక Read more

ముగిసిన మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన
Minister Nara Lokesh visit to America has ended

అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అమెరికాలో పెట్టుబడుల యాత్ర విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ఆయన వరుస Read more

నేటి నుండి అసెంబ్లీ సమావేశాలు..ఏపీ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం
WhatsApp Image 2024 11 11 at 10.56.56

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు.. ఏపీ కేబినెట్ భేటీ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి వర్గం రాష్ట్ర 2024-25 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *