vizag gag rap

విశాఖ గ్యాంగ్ రేప్.. వెలుగులోకి కీలక విషయాలు

ఏపీలో అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే కామాంధులు రెచ్చిపోతున్నారని , ఒంటరి మహిళలపై , అభంశుభం తెలియని చిన్నారులకు అత్యాచారాలకు పాల్పడుతున్నారని అప్పుడు ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అత్యాచారం అనే వార్త వెలుగులోకి వస్తూనే ఉంది.

తాజాగా విశాఖలో న్యాయవిద్య అభ్యసిస్తున్న ఒక యువతిపై నలుగురు సహచర విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. ఓ పథకం ప్రకారం ప్రేమికుడితోపాటు, మరో ముగ్గురు స్నేహితులు ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి ఈ దురాగతానికి పాల్పడ్డారు. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ దారుణం బయటపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ అత్యాచారం కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ప్రేమ, పెళ్లి పేరుతో యువతికి దగ్గరైన ప్రియుడే ఆమెను వంచించాడు. వీరు ఏకాంతంగా గడిపిన వీడియోను చూపించి అతడి స్నేహితులు సైతం లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాతా తమ కోరిక తీర్చాలని వారు వేధించడం, ప్రియుడు సైతం ఫ్రెండ్స్ కోరిక తీర్చాలని ఒత్తిడి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది. తండ్రి కాపాడి ప్రశ్నించడంతో విషయం బయటకొచ్చింది.

నగరానికి చెందిన ఓ యువతికి సహ విద్యార్థి వంశీతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువతి నిరాకరించినా వంశీ బలవంతంగా శారీరకంగా కలిశాడు. ఆగస్టు 13న వంశీ ఆ యువతిని ద్విచక్రవాహనంపై తన స్నేహితుడు ఆనంద్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతం చేసి మరోమారు శారీరకంగా కలిశాడు. దాన్ని రహస్యంగా వీడియో తీసిన ఆనంద్, రాజేష్, జగదీశ్ గదిలోకి వచ్చి ఆమెను బెదిరించారు. తరువాత ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా ఒకరు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నట్లు దర్యాప్తు లో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.

Related Posts
డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల మోసం
డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల మోసం

నాగరాజు అనే వ్యక్తి, స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ ఉద్యోగిగా నటించి ప్రతి వ్యక్తి నుండి 50,000 నుండి 65,000 రూపాయల వరకు వసూలు చేశాడు. Read more

టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ విజేతగా ప్రజ్ఞానంద
Praggnanandhaa winner

ప్రఖ్యాత టాటా స్టీల్ చెస్ మాస్టర్స్-2025 ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద విజేతగా నిలిచారు. నెదర్లాండ్స్‌లోని Wijk aan Zeeలో జరిగిన ఉత్కంఠభరిత టైబ్రేక్ మ్యాచ్‌లో Read more

హైదరాబాద్‌లో బీజేపీ-కాంగ్రెస్ ఘర్షణ
హైదరాబాద్‌లో బీజేపీ-కాంగ్రెస్ ఘర్షణ

ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంగళవారం నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద Read more

సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్
fake employees in the secre

హైదరాబాద్‌ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *