vizagsteel

విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై కేంద్రం ప్రకటన

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై నేడు అధికారికంగా ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బేషరతుగా ఆమోదం తెలిపినట్టు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోదీకి, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ఉద్దీపన ప్యాకేజి ఇవ్వాలని నిన్నటి కేంద్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించడం తెలిసిందే.

విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం పట్ల కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. ప్రకటించిన ప్యాకేజీలో… రివైవల్ ప్యాకేజీ కింద రూ.10,300 కోట్లు కేటాయించారని వివరించారు. ఉక్కు పరిశ్రమ నష్టాలను అధిగమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగపడుతుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ ప్యాకేజీ ఓ నిదర్శనమని రామ్మోహన్ వివరించారు.

Related Posts
మన్మోహన్ సింగ్ గౌరవార్థం: నల్ల బ్యాండ్ ధరించిన భారత జట్టు
మన్మోహన్ సింగ్ గౌరవార్థం: నల్ల బ్యాండ్ ధరించిన భారత జట్టు

మన్మోహన్ సింగ్ గౌరవార్థం భారత క్రికెటర్లు నల్ల బ్యాండ్ ధరించారు 2004 నుండి 2014 వరకు భారతదేశానికి రెండు దఫాలుగా ప్రధానమంత్రిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్, Read more

పార్లమెంట్లో మిథున్ రెడ్డి కీలక ప్రకటన
ఇవాళ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చ జరుగుతోంది

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపక్ష వైసీపీకి, అధికార పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు మధ్య సాగుతున్న పోరు నిత్యం చూస్తూనే ఉన్నాం. వైసీపీ వర్సెస్ Read more

అమిత్ షాతో పర్వేశ్ వర్మ భేటీ
amith shah

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా బీజేపీ దూసుకుపోతుండటంతో… దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దేశ రాజధానిలో జెండా ఎగురవేయాలనే బీజేపీ Read more

వాట్సప్‌ ద్వారానే పౌర సేవలు..మెటా- ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం
Civil services through WhatsApp.Meta Agreement between AP Govt

న్యూఢిల్లీ: ఢిల్లీలోని 1 జన్‌పథ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెటా సంస్థ ప్రతినిధులు రవిగార్గ్‌, నటాషా, ఆర్టీజీఎస్‌ సీఈవో దినేశ్‌, ఐఏఎస్‌ అధికారి, ఏపీ ఐటీ, విద్యాశాఖ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *