Bomb threats to the plane. Emergency landing in Raipur

విమానానికి బాంబు బెదిరింపులు.. రాయ్‌పూర్‌లో అత్యవసర ల్యాండింగ్‌

రాయ్పూర్ : దేశంలో ఇటీవల వందలాది విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో విమానానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. నాగ్‌పూర్‌ నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానానికి గురువారం ఎమర్జెన్సీ అలర్ట్‌ వచ్చింది. విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాలని భావించారు. అధికారుల అనుమతితో విమానాన్ని రాయ్‌పూర్‌ కు దారి మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్‌ చేశారు. అనంతరం ప్రయాణికులనంతా దింపేశారు.

Advertisements

సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్‌ స్వ్కాడ్‌, బాంబ్‌ స్వ్కాడ్‌తో అక్కడికి చేరుకొని విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిసింది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో రాయ్‌పూర్‌ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. ఈ క్రమంలో అక్కడ విమాన రాకపోలకు కొంత అంతరాయం ఏర్పడింది.

కాగా, ల్యాండింగ్‌కు గల కారణం తెలియకపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సాంకేతిక సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ విమానాన్ని తనిఖీ చేశారని అన్నారు. విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు మొత్తం 187 మంది ప్రయాణికులు ఉన్నారు.

Related Posts
Etihad Airways: ఎతిహాద్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్: భారతీయులకు 30% డిస్కౌంట్!
ఎతిహాద్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్: భారతీయులకు 30% డిస్కౌంట్!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయ ప్రయాణికులకు ప్రత్యేక డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ వేసవిలో ఎతిహాద్ విమానాల్లో ప్రయాణించే భారతీయులకు Read more

KTR : కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు:కుమార్ గౌడ్
KTR కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు కుమార్ గౌడ్

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన ఆరోపణలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ Read more

కత్తితో హల్ చల్..
employee attack

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు లీవ్స్ ఉండటం సహజమే.ఏదైనా అత్యవసర పని ఉన్నప్పుడు అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఇటు ప్రైవేట్ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు లీవ్స్ పెట్టడం చూస్తుంటాం. ఒకవేళ Read more

పాపం కర్ణాటక సీఎంకు అసలు సొంత ఇల్లే లేదట..
karnataka cm siddaramaiah

కర్ణాటక సీఎం సిద్దరామయ్య ముడా స్కాం విషయంలో తనపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ నిజాయతీతో పనిచేశానని, అవినీతి Read more

×