vijayasai reddy

విజ‌య‌సాయిరెడ్డికి ఈడీ మ‌ళ్లీ నోటీసులు

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకున్న వైసీపీ నాయకుల అవినీతి చిట్టాను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ పోర్టు వ్య‌వ‌హారంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్ప‌టికే ప‌లు నోటీసులు జారీ చేసినప్పటికీ వివిధ‌ కార‌ణాల‌తో ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రుకాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌ళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ.. సోమ‌వారం త‌మ ఎదుట‌ విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.


కాకినాడ సీ పోర్టు లిమిటెడ్‌, సెజ్‌లో క‌ర్నాటి వెంక‌టేశ్వ‌ర‌ రావు వాటాల‌ను బ‌ల‌వంతంగా లాక్కున్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేవీ రావు ఫిర్యాదును ప‌రిశీలించిన ఈడీ.. విజ‌య‌సాయిరెడ్డి మ‌నీ లాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించింది.
ఈమేర‌కు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఇప్ప‌టికే జారీ చేసిన నోటీసుల‌కు ప‌లు కార‌ణాల‌తో విచార‌ణ‌కు హాజరుకాలేనంటూ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ఇక తాజా నోటీసుల నేప‌థ్యంలో ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

Related Posts
టెన్త్ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్
AP govt

పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతుండగా, సెలవుల్లో కూడా వారికి మధ్యాహ్న Read more

సంక్రాంతికి సొంతవూర్లకు వెళ్లేవారికి తీపి కబురు
APSRTC Good News

సంక్రాంతి పండుగ సందర్బంగా తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి Read more

నా భర్తకు ప్రాణహాని ఉంది :వంశీ భార్య
నా భర్తకు ప్రాణహాని ఉంది :వంశీ భార్య

విజయవాడ కోర్టు వైసీపీ నేత వల్లభనేని వంశీకి 14 రోజుల న్యాయవిధి కింద రిమాండ్ విధించింది. కిడ్నాప్, దాడి, బెదిరింపు కేసులో ఆయనపై ఆరోపణలు నమోదవగా, పోలీసులు Read more

సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం
pawan tirumala laddu

AP Govt suspends SIT investigation అమరావతి: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *