రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధను పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బందరు తాలుకా పోలీస్ స్టేషన్‌కు పేర్ని జయసుధ వచ్చారు. తన న్యాయవాదులతో కలసి విచారణకు వచ్చిన పేర్ని జయసుధను.. రాబర్ట్‌సన్ పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏసు బాబు విచారిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం అంశంపై పేర్ని జయసుధ నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఏ1గా పేర్ని జయసుధ ఉన్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని జయసుధకు నిన్న నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు హాజరవ్వాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, పేర్ని జయసుధ మచిలీప్పట్నం మేయర్ కారులో తన న్యాయవాదులతో కలిసి పీఎస్ కు వచ్చారు. అయితే విచారణకు ఆమె తరఫు న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. ప్రస్తుతం పేర్ని జయసుధను ఆర్.పేట సీఐ ఏసుబాబు విచారిస్తున్నారు. బందరు మండలం పొట్లపాలెంలో పేర్ని నాని .. తన భార్య పేరిట గోడౌన్లు నిర్మించారు. అందులో రేషన్ బియ్యం బఫర్ నిల్వలను ఉంచారు. ఆ క్రమంలో దస్త్రాల్లో ఉన్న బియ్యం బస్తాల నిల్వలకు.. గోడౌన్లలో ఉన్న సరకుకు భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. దాదాపు వేలాది బియ్యం బస్తాల తేడా ఉండడంతో… పేర్ని నాని సతీమణికి నోటీసులు జారీ చేశారు.