gachibowli flyover closed

వారం పాటు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మూసివేత..ఎందుకంటే..!!

హైదరాబాద్‌లోని వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ అధికారులు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ కారణంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ.. ఈ ఆంక్షలు అక్టోబర్ 28 వరకు అమలులో ఉంటాయన్నారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మూసివేత కారణంగా, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. బయోడైవర్సిటీ జంక్షన్‌ నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వైపు ప్రయాణించే వాహనాలు బిచ్చారెడ్డి స్వీట్స్‌ ద్వారా మళ్లిస్తారు. అలాగే, ఐఐఐటీ జంక్షన్‌ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌కు వెళ్లే వాహనాలు కూడా గచ్చిబౌలి జంక్షన్‌ పక్కనుండి వెళ్తాయి. వాహనదారులు తమ ప్రయాణాలకు ముందుగా ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని సురక్షితంగా ప్రయాణం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related Posts
తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులకు అల్పాహారం ఇదే..!
CM Breakfast scheme

రాష్ట్రంలో 10వ తరగతికి సిద్దమవుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా మెనూ రూపొందించారు రాష్ట్రంలోని ప్రభుత్వ, Read more

వామ్మో.. 9 రోజుల్లో రూ.713 కోట్ల మద్యం తాగేశారు

దసరా పండుగకు ముందు వరుస సెలవుల నేపథ్యంలో తెలంగాణ లో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. గత 9 రోజుల్లో రూ.713.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు Read more

ఏపీలో మరోవారంలో భారీ వర్షాలు
rain ap

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాయలసీమ Read more

సర్కారులో చలనం వచ్చింది: కేటీఆర్‌
KTR Congress

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ట్వీట్టర్ లో మండిపడ్డారు. గురుకులాల విద్యార్థులను తమ హయాంలో ఎవరెస్ట్ ఎక్కించి రికార్డులు సృష్టించేలా చేశామని, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *