wayanad disaster

వయనాడ్‌ మృతులకు కేరళ సర్కార్‌ పరిహారం

కేరళలోని వయనాడ్‌లో గతేడాది సంభవించిన ఘోరవిపత్తు ఘటనపై పినరయి విజయన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన వారిని మృతులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో విపత్తులో గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని, పరిహారం అందించేందుకు సహాయపడుతుందని అభిప్రాయపడింది. మిస్ అయిన వ్యక్తుల జాబితాను పరిశీలించేందుకు రెవెన్యూ శాఖ అధికారులతో సహా స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది.

కాగా, గతేడాది జులై 30న వయనాడ్‌లో ఘోర ప్రకృతి విపత్తు సంభవించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఘటనలో సుమారు 263 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. మరో 35 మంది మిస్సయ్యారు.

ఈ కమిటీ విపత్తులో తప్పిపోయిన వారి జాబితాను తయారు చేసి పరిశీలన కోసం జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీకి సమర్పిస్తుంది. డీడీఎమ్‌ఏ ఆ జాబితాను పరిశీలించి రాష్ట్ర స్థాయి కమిటీకి పంపితే.. అక్కడి నుంచి ఆ జాబితా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ జాబితాలో పేర్లు ఉన్నవారిని ప్రభుత్వం మృతులుగా ప్రకటించి.. వారి బంధువులకు పరిహారం అందిస్తుంది.

Related Posts
కొనసాగుతున్న ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు..
Counting of votes for the ongoing Delhi elections

న్యూఢిల్లీ: దేశ రాజధానిని పాలించేది ఎవరు..? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా.. లేక ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా..?ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఏం Read more

కోహ్లీకి కోపం వ‌చ్చిందా క‌నిపిస్తే చాలు ఫొటోలు
kohli 2

భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఎక్కడ కనిపించినా అభిమానులు, మీడియా ఫోటోగ్రాఫర్లు వెంటనే ఫోటోలు తీయడానికి ఉత్సాహపడతారు. కానీ, ఈ తరహా జోక్యం కొన్నిసార్లు Read more

10.5 లక్షల వరకు పన్ను మినహాయింపు
10.5 లక్షల వరకు పన్ను మినహాయింపు

10.50 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపును ప్రభుత్వం పరిగణించవచ్చు: నివేదిక ప్రభుత్వం, తక్కువ ఆదాయం పొందే పన్ను చెల్లింపుదారులకు అంటే 10.5 లక్షల వరకు పన్ను Read more

ఆశారాంకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు
asaram bapu

ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు భారత అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. 2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన 86 ఏళ్ల ఆశారాంకు Read more