aghori arest

లేడీ అఘోరీ అరెస్ట్..

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దీ రోజులుగా లేడి అఘోరి హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యాచారాలు, గోహత్యల నివారణకే నేనున్నా అని అందుకోసం ఎన్నో పూజలు చేసానని చేస్తూనే ఉన్నానని చెపుతూ.. లోక కళ్యాణం, సనాతన ధర్మాన్ని కాపాడుతానని మీడియా ముందు చెప్పుకుంటూ తిరుగుతున్న అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసారు.

సోమవారం ఏపీలోని మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ జనసేన పార్టీ ఆఫీసు ముందు బైటాయించింది. పవన్ కళ్యాణ్‌ను కలిశాకే వెళ్తానంటూ రోడ్డుపైనే అడ్డంగా కూర్చుంది. దీంతో ఎక్కడిక్కడే వాహనాలు నిలిపోయాయి. పవన్ కళ్యాణ్ ఇక్కడ లేరని ఎవరూ ఎంత సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా కూడా ఆమె అస్సలు వినలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులపైనా కూడా అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా అంతేకాకుండా వారిపైనే దాడికి ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఇక ఆమె చేష్టలకు విసుగెత్తి పోయినా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను ఈడ్చు కెళ్ళి DCM లో పడేశారు. ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించినా కానీ ఆమె తగ్గట్లేదు. దాంతో ఆమె ఒక్కసారిగా వాహనంలో నుంచి పోలీసులవైపుకి దూకి దాడి చేసే ప్రయత్నం చేసింది. అఘోరీ ప్రవర్తన చూసి ఆ రోడ్డుపైన ఆగిపోయిన ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎంతోమంది అఘోరాలు ఉన్నారు కానీ ఇలా వారు జనాలను ఇబ్బంది పెట్టె ప్రయత్నాలు చేయలేదని మీడియాకి చెప్పారు.

Related Posts
HAPPY BIRTHDAY రెబల్ స్టార్ ‘ప్రభాస్’
prabhas bday

బాహుబలి చిత్రంతో ప్రపంచ దేశాల్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన స్టార్ 'ప్రభాస్'. నాటి నుంచి పాన్ ఇండియా జైత్రయాత్ర మొదలుపెట్టిన ఆయన పుట్టిన రోజు నేడు. Read more

ఏపీలో ఎడతెరిపి లేని వర్షాలు
rain

అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురియడంతో జనజీవనం అస్తవ్యస్తమైనది. బంగాళాఖాతంలో ఏర్పడిన Read more

కొత్త ఉద్యోగం కోసం నిపుణుల వెతుకులాట..!
Looking for professionals for a new job.

న్యూఢిల్లీ : భారతదేశంలోని 55% మంది నిపుణులు ఉద్యోగ శోధన పట్ల నిరాశ చెందుతున్నారు, ఎందుకంటే గత సంవత్సర కాలంలో ఈ ప్రక్రియ కష్టతరంగా మారిందని వారు Read more

ఇండియా కూటమిని రద్దు చేయాలి: ఒమర్ అబ్దుల్లా
ఇండియా కూటమిని రద్దు చేయాలి: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆప్, కాంగ్రెస్ మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలను ఉద్దేశించి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రతిపక్షాలు ఐక్యంగా లేని కారణంగా ఇండియా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *