LA wildfire

లాస్‌ ఏంజెల్స్‌లో కొనసాగుతున్న మంటలు

అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తున్నది. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో మంటలు అదుపులోకి రావడం లేదు. వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవిస్తున్నది. ప్రాణనష్టం సైతం పెరుగుతున్నది. శనివారం రాత్రికి మృతుల సంఖ్య 16కు పెరిగినట్టు అధికారులు తెలిపారు.
పాలిసేడ్స్‌, ఏటన్‌, కెన్నెత్‌, హర్ట్‌లో దాదాపు 62 చదరపు మైళ్ల మేర మంటలు వ్యాపించాయి. మంటలను ఆర్పేందుకు కాలిఫోర్నియాతో పాటు అమెరికాలోని తొమ్మిది నగరాలు, మెక్సికోకు చెందిన అగ్నిమాపక బృందాలు పని చేస్తున్నాయి. కాగా, లాస్‌ ఏంజెల్స్‌లో నివసించే హాలీవుడ్‌ నటులు వారికి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వినియోగించుకున్నారని, దీంతో ఇప్పుడు మంటలు ఆర్పేందుకు నీటి కొరత ఏర్పడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కమలా హారిస్‌ ఇంటికీ ముప్పు
కార్చిచ్చు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం పాలిసేడ్స్‌ అగ్ని బ్రెంట్‌వుడ్‌ వైపు మళ్లింది. ఈ ప్రాంతంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు పలువురు క్రీడాకారులు, నటీనటుల ఇండ్లు ఉన్నాయి. దీంతో ఉపాధ్యక్షురాలి హోదాలో చేయాల్సిన తన చివరి విదేశీ పర్యటనను కమలా హారిస్‌ రద్దు చేసుకున్నారు. మరోవైపు అమెరికాలోని టెక్సాస్‌, ఓక్లహోమా, మరికొన్ని రాష్ర్టాలను మంచు తుఫాను అతలాకుతలం చేస్తున్నది.

Related Posts
ప్రపంచంలోనే అత్యధిక వయస్కుడు మృతి
world oldest man john alfre

ప్రపంచంలో అత్యధిక వయసుగల వ్యక్తిగా పేరొందిన జాన్ టిన్నిస్వుడ్ కన్నుమూశారు. ఆయన వయసు 112 ఏళ్లు. సౌత్ పోర్టులోని కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతూ జాన్ మృతిచెందినట్లు Read more

sunitha williams: సునీతా విలియమ్స్‌కు డాల్ఫిన్ల స్వాగతం
సునీతా విలియమ్స్‌కు డాల్ఫిన్ల స్వాగతం

భూమికి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంభారత సంతతికి చెందిన ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ చివరకు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భూమికి చేరుకున్నారు. ఆమెతో పాటు బుచ్ Read more

జెలెన్‌స్కీ క్షమాపణలు చెప్పాలి: అమెరికా
ట్రంప్, జెలెన్‌స్కీ ఆ మధ్య పెరుగుతున్న దూరం?

మూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి అమెరికా చేసిన తొలి ప్రయత్నం విఫలమైనట్టే. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉక్రెయిన్‌కు చెందిన Read more

America: భారతీయ స్కాలర్‌ను అమెరికా ఎందుకు అరెస్ట్ చేసింది?
భారతీయ స్కాలర్‌ను అమెరికా ఎందుకు అరెస్ట్ చేసింది?

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భారత సంతతి రీసర్చ్ స్కాలర్ బదర్ ఖాన్ సురిని అమెరికానుంచి బహిష్కరించవద్దని ఆదేశిస్తూ అమెరికన్ కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. Read more