ktr jail

రైతుల కోసం జైలుకు పోవ‌డానికి నేను సిద్ధం – కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రజలు, రైతుల సంక్షేమం కోసం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన రైతన్నల ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. “ప్రజలు, రైతుల కోసం ఒకటి, రెండు సంవత్సరాలు జైల్లో ఉండేందుకు సిద్ధం” అని అన్నారు. “కాంగ్రెస్‌ను ఉరికించి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి” అని పేర్కొన్నారు.

హైద‌రాబాద్ నుంచి ఉద‌యం ఏడున్నర‌కు మొదలైన మాకు కాంగ్రెస్ పాలనలో అన్ని పనులు అస్తవ్యస్తంగాకనిపించాయి. డిచ్‌పల్లి వద్ద మహిళలు రోడ్డుకు అడ్డంగా కూర్చుని ధర్నా చేస్తున్నారు. మేము అక్కడికి చేరుకొని వారి బాధలు అడిగి తెలుసుకున్నాం. పోలీసు భార్యలుగా ఉండి కూడా పోలీసుల చేతుల్లోనే దెబ్బలు తినే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తులం బంగారం ఇస్తామ‌ని చెప్పి మోసం చేసిన వారు, రైతుబంధు ఎగ్గొట్టి, రుణమాఫీ చేయకుండా ఉన్న ఈ ప్రభుత్వం పై రైతులు కేసులు పెట్టాలి” అని అన్నారు. 2 లక్షల ఉద్యోగాల్ని చెప్పి ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనందుకు యువత కూడా కేసులు పెట్టాలి అన్నారు.

పోలీసుల‌ను కోరుతున్నా.. అధికారం ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. ఇలాంటి కిరాత‌క ప‌నులు బీఆర్ఎస్ పాల‌న‌లో చేయ‌లేదు. మంత్రినో, కంత్రినో ఫోన్ చేస్తే ఆగం కాకండి.. న్యాయం, ధ‌ర్మం ప్ర‌కారం న‌డుచుకోండి. పోలీసులైనా, అధికారులైనా ఎక్స్‌ట్రాలు చేస్తే పేర్లు రాసిపెట్టి మిత్తితో స‌హా ఇస్తాం. రేవంత్ రెడ్డి రాజు, చ‌క్ర‌వ‌ర్తి కాదు. చంద్ర‌బాబు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి నాయ‌కుల‌తోనే కొట్లాడినం.. వీడెంత చిట్టినాయుడు.. గింతంత మ‌నిషి.. వాని చూసి ఆగం కావొద్దు అన్నారు.

Related Posts
బీఆర్ఎస్ పార్టీ విప్‌లుగా కె.పి. వివేకానంద, సత్యవతి రాథోడ్
sathyavathi rathod and vivekananda

తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌లను ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా కె.పి. వివేకానంద Read more

తెలంగాణలో మొదలైన కులగణన
census survey telangana

తెలంగాణ లో ఈరోజు కులగణన సర్వే మొదలైంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, భూమి, రుణాలు, వ్యవసాయం, స్థిరాస్తి, రేషన్ సహా పలు అంశాలపై Read more

తెలంగాణలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్ ధరల పెంపు
తెలంగాణలో 'గేమ్ ఛేంజర్' టికెట్ ధరల పెంపు

రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ ధరల పెంపును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అవుతున్న 'గేమ్ ఛేంజర్' Read more

మినీ మేడారం జాతరకు వేళాయే..
medaram

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళా అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు సమయం ఆసన్నమైంది. మహాజాతర ముగిసిన ఏడాదికి అదే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *