nagavamsi

రేవంత్ రెడ్డిని క‌లిసే యోచ‌న‌లో టాలీవుడ్ ప్ర‌ముఖులు

టాలీవుడ్ ప్ర‌ముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని క‌లిసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు అమెరికా నుంచి తిరిగి రాగానే ముఖ్య‌మంత్రిని కలుస్తామ‌ని నిర్మాత నాగ‌వంశీ తాజాగా మీడియాకు తెలిపారు.

Advertisements

టికెట్ ధ‌ర‌ల పెంపు, ప్రీమియ‌ర్ షోల‌పై చ‌ర్చిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట‌ ఘ‌ట‌న కార‌ణంగా ఇక‌పై టికెట్ ధ‌ర‌ల పెంపు, బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాను ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణ‌లో స్పెష‌ల్ షోలు, బెనిఫిట్ షోల‌కు ప‌ర్మిష‌న్‌ ఇచ్చేది లేద‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.
కొత్త సినిమాలపై ప్రభావం
దీని ప్ర‌భావం వచ్చే సంక్రాంతికి విడుద‌ల కానున్న పెద్ద సినిమాలు ‘గేమ్ ఛేంజ‌ర్‌’, ‘డాకు మ‌హారాజ్‌’, ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’పై ప‌డే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలోనే టాలీవుడ్ ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రిని క‌లిసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.
మీడియాతో నాగ‌వంశీ
ఇక బాబీ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా వ‌స్తున్న డాకూ మ‌హారాజ్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం మేక‌ర్స్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగానే ప్ర‌స్తుతం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల దృష్ట్యా సీఎంను క‌లిసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Related Posts
CM Revanth Reddy : ఈనెల 15న జపాన్‌కు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy to visit Japan on 15th of this month

CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి జపాన్ టూర్ షెడ్యూల్ Read more

ఎంపీల కార్లకు అలవెన్సుల కింద నెలకు రూ. లక్ష – ఏపీ సర్కార్
AP govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యుల కార్ల నిర్వహణకు నెలకు రూ. లక్ష చొప్పున అలవెన్సు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ Read more

రేపు కేంద్ర కేబినెట్ భేటీ..
Central cabinet meeting tomorrow

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు (బుధవారం) కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు జరుగనున్న ఈ కేంద్ర కేబినెట్ మీటింగులో పలు కీలక Read more

మొదటి రోజు గ్రూప్-1 మెయిన్సు 72.4% హాజరు
72.4 attendance for Group

ఈ రోజు జరిగిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 72.4% హాజరు నమోదైంది. మొత్తం 31,383 అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హత సాధించినప్పటికీ, నేడు 22,744 మంది మాత్రమే Read more

Advertisements
×