revanth reddy, satya nadella

రేవంత్ రెడ్డికి శుభవార్త చెప్పిన స‌త్య నాదెళ్ల‌

ఐటీ రంగంలో హైదరాబాద్ ముందుకు దూసుకుని వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్లతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టే అన్ని కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వామిగా ఉండాల‌నే త‌మ నిబద్ధతను కొన‌సాగిస్తామ‌ని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు.

Advertisements

హైద‌రాబాద్‌లోని స‌త్య నాదెళ్ల నివాసంలో ఆయ‌న‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమ‌వారం భేటీ అయింది. ఈ సంద‌ర్భంగా నైపుణ్యాభివృద్ధి, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విష‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి దార్శ‌నిక‌త‌ను స‌త్య నాదెళ్ల ప్ర‌శంసించారు.

Revanth Reddy and CEO Satya Nadella


హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థ
నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక‌ వ‌స‌తులే ఆర్థికాభివృద్ధికి దోహ‌ద‌ప‌డి హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని స‌త్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒక‌ట‌ని, ప్ర‌స్తుతం 10,000 మందికి ఉపాధి క‌ల్పిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌త్య నాదెళ్ల‌కు తెలిపారు. రాష్ట్రంలో 600 మెగావాట్ల (MW) సామ‌ర్థ్యం క‌లిగిన డేటా సెంటర్ లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబ‌డి పెట్టింద‌ని, హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ‌వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు స‌త్య నాదెళ్ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
మైక్రోసాఫ్ట్ మ‌ద్ద‌తును కోరిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ను టెక్నాలజీ డొమైన్‌లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపివేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టిసారిస్తున్న ఏఐ, Gen AI, క్లౌడ్‌తో సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణ‌మైన వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు స‌త్య నాదెళ్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Related Posts
కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం: కెటిఆర్
కౌశిక్ రెడ్డి అరెస్టు దారుణం కెటిఆర్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఖండించారు. తప్పుడు కేసులు పెట్టడం, బీఆర్ఎస్ నాయకులను తరచుగా అరెస్టు చేయడం Read more

Raja Singh: ఔరంగజేబ్ సమాధిని కూల్చేస్తామన్నా రాజాసింగ్
Raja Singh: ఔరంగజేబ్ సమాధిని కూల్చేస్తామన్నా రాజాసింగ్

ఔరంగజేబ్ సమాధి వివాదం – దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధి అంశం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. Read more

తెలంగాణలో మేఘా ఇంజనీరింగ్ భారీ పెట్టుబడులు
తెలంగాణలో మేఘా ఇంజనీరింగ్ భారీ పెట్టుబడులు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అనేక కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపి, Read more

రేపటి టీజీ టెట్ కు అంతా సిద్ధం
tet exame

రేపటినుంచి జరుగనున్న టీజీ టెట్ – 2024 ప‌రీక్ష‌కు తెలంగాణ ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. అంతా సిద్ధం రేపటి టీజీ టెట్ కు కోసం. అర్హ‌త Read more

×