revanth, babu

రేవంత్ నిర్ణయం ఏపీపైనా ప్రభావం

హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టు, విచారణ వంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పేసింది. దీంతో ఇబ్బందుల్లో పడ్డ టాలీవుడ్ .. చివరి ప్రయత్నంగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజును తీసుకెళ్లి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ భేటీతో వీరిద్దరి మధ్య దూరం తగ్గుతుందనుకుంటే మరింత పెరిగేలా ఉంది. అదే సమయంలో ఈ భేటీ ప్రభావం ఏపీపైనా పడబోతోంది.
తెలంగాణలో టాలీవుడ్ సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకూడదన్న తమ నిర్ణయంలో మార్పేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పేశారు. దీంతో టాలీవుడ్ కు, అందులో భాగమైన ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుకూ భారీ షాక్ తప్పలేదు. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రూపంలో రెండు సినిమాల విడుదలకు సిద్దమైన దిల్ రాజుకు రేవంత్ నిర్ణయం మింగుడుపడని పరిస్ధితి. అలాగే తర్వాత రాబోయే సినిమాలకూ షాక్ తప్పడం లేదు.

Related Posts
విపక్షాల విమర్శలపై సీఎం రేవంత్ ఫైర్
Telangana CM Revanth returns to Hyderabad from Davos

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై విపక్షాల విమర్శలను తీవ్రంగా ఖండించారు. దావోస్ పర్యటనకు పెట్టుబడులను ఆకర్షించడం మాత్రమే లక్ష్యమని, దీనిపై తప్పుడు విమర్శలు చేయడం Read more

అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
BRS Nirasana

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం నిరసనలతో హోరెత్తింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫార్ములా ఈ-రేసు కేసులో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై (కేటీఆర్) ఏసీబీ కేసు నమోదు చేసినందుకు Read more

రైతుల రుణా మాఫీ: కాంగ్రెస్‌కు కేటీఆర్‌ సవాల్‌
రైతుల రుణా మాఫీ కాంగ్రెస్ కు కేటీఆర్ సవాల్

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న ఘర్షణను పలు స్థాయిలలో ఎత్తివేస్తూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, Read more

ముండ్లమూరులో వరుసగా భూప్రకంపనలు
earthquakes prakasam distri

ప్రకాశం జిల్లా ముండ్లమూరులో వరుసగా మూడు రోజులుగా భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. శనివారం ఉదయం మొదలైన ప్రకంపనలు ఆదివారం, సోమవారం వరకు కొనసాగాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *