ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్’ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లను రాబట్టింది. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించగా, ప్రశాంత్ వర్మ మేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ప్రస్తుతం ‘కాంతార 2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ‘కాంతార’ సినిమాతో రిషబ్ టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు.

చిన్న బడ్జెట్‌తో విడుదలైన ‘కాంతార’ భారీ విజయాన్ని సాధించింది.ఈ సినిమాతో రిషబ్ శెట్టి నటనతో కాకుండా, కాను జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం రిషబ్ శెట్టికి తెలుగు, హిందీ పరిశ్రమల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి.ఈ క్రమంలో రిషబ్ శెట్టి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, టీజర్ విడుదలయ్యాయి. రిషబ్ శెట్టిని హనుమంతుడిగా చూపించడంపై ప్రేక్షకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.రిషబ్ శెట్టి మరియు చిత్రబృందంపై నాంపల్లి కోర్టులో న్యాయవాది తిరుమలరావు ఫిర్యాదు చేశారు.’జై హనుమాన్’ పోస్టర్‌లో రిషబ్ శెట్టి పొడవాటి గడ్డంతో రాముడి విగ్రహాన్ని ఆలింగనం చేస్తున్నట్లు చూపించారు. హనుమంతుడి రూపాన్ని సాధారణ మనిషిలా చూపించడం కొందరి అభ్యంతరాలకు కారణమైంది. హనుమంతుడిని కోతి ముఖంతో చూపించకపోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, పోస్టర్‌లు మరియు టీజర్‌లను ఉపసంహరించుకోవాలని తిరుమలరావు పిటిషన్ దాఖలు చేశారు.’జై హనుమాన్’ సినిమా రామాయణం తర్వాత హనుమంతుడు రాముడికి ఇచ్చిన వాగ్దానం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ వివాదంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.