sandeep dikshit

రిగ్గింగ్‌ జరగలేదని ఈసీ ఎలా చెప్పగలదు : సందీప్‌ దీక్షిత్‌

కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. ఈ సందర్బంగా ఈవీఎంల రిగ్గింగ్‌ జరగలేదని ఈసీ చేసిన ప్రకటనపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తనయుడు సందీప్‌ దీక్షిత్‌ స్పందించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతున్నదని అయన వ్యాఖ్యానించారు. ఈవీఎంలను రిగ్గింగ్‌ చేయడం అసాధ్యమని కొద్దిసేపటి క్రితం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.

న్యూఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తనయుడు సందీప్‌ దీక్షిత్‌ ఈవీఎంలపై మరోసారి విమర్శలు చేశారు. ఈవీఎంల రిగ్గింగ్‌ అసాధ్యమని ఎన్నికల సంఘం ఎలా చెప్పగలదని ఆయన ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా ఈవీఎంల రిగ్గింగ్‌ చోటుచేసుకుందని అన్నారు. ఓట్లు గంపగుత్తగా ఒకే పార్టీకి పడుతున్నా కూడా ఈవీఎంల రిగ్గింగ్‌ అసాధ్యమని చెప్పడం అమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు సామాన్య ప్రజలు చాలా మంది ఈవీఎంల రిగ్గింగ్‌ గురించి మాట్లాడారని చెప్పారు.

‘మీరెందుకు అనవసరంగా ఓట్లడుగుతున్నారు..? ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీకే పడుతున్నాయిగా. ఈవీఎంలు ఉన్నంత కాలం ఓట్లు బీజేపీకే వెళ్తాయి’ అని సామాన్యులు అంటున్నట్లు సందీప్‌ దీక్షిత్‌ తెలిపారు. ఈవీఎంలు ఉన్నంత కాలం బీజేపీ తప్ప మరే పార్టీ గెలువదని సామాన్యులు చెబుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Related Posts
స్వామిత్వ పథకం కార్డులను పంపిణీ చేసిన మోదీ
స్వామిత్వ పథకం కార్డులను పంపిణీ చేసిన మోదీ2

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం స్వామిత్వ పథకం కింద 65 లక్షలకు పైగా ఆస్తి కార్డులను 10 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలలో పంపిణీ Read more

అమెరికా నుంచి వెళ్లిపోతున్న ఉద్యోగులు
అమెరికా నుంచి వెళ్లిపోతున్న ఉద్యోగులు

అమెరికా తన ఆర్థిక సహాయాన్ని నిలిపివేయడంతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యూఎస్ఎయిడ్ (USAID) ఉద్యోగుల తొలగింపు, కార్యాలయాల మూసివేత, విదేశీ సహాయం రద్దు వంటి చర్యలు తీవ్ర Read more

ఈ గ్రామాల్లో హోలీ పండగ జరుపుకోరు
ఈ గ్రామాల్లో హోలీ పండగ జరుపుకోరు

రంగుల పండుగ అయిన హోలీని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. హోలీ పండగ అంటే చాలు ప్రతి ఒక్కరి మనసులో ఆనందం ఉత్సాహం కలుగుతుంది. హోలీ రోజున Read more

మహారాష్ట్రలో మహాయుతి కూటమి 220 మార్క్ దాటింది..
MAHAYUTI

2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం, బిజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 222 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్లు ప్రారంభ ట్రెండ్‌లు సూచిస్తున్నాయి. మహాయుతి కూటమి బిజేపీ, Read more