ambedkhar

రాహుల్‌, ఖ‌ర్గేల‌తో మోదీ భేటీ

అంబేద్క‌ర్ వ‌ల్లే తాము ఇక్క‌డ ఉన్న‌ట్లు మోదీ చెప్పారు. అంబేద్క‌ర్ విజిన్‌ను పూర్తి చేసేందుకు గ‌త ద‌శాబ్ధ కాలం నుంచి త‌మ నిర్విరామంగా కృషి చేస్తున్నామ‌న్నారు. మోడీ ఈ ఇలా మాట్లేడేందుకు ఓ కారణం వుంది. కేంద్ర మంత్రి అమిత్ షా.. త‌న ప్ర‌సంగంలో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్క‌ర్‌ను అవ‌మానించిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు ప్ర‌ధాని మోదీ స్పందించారు. ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ఇవాళ స్పందించారు. అంబేద్క‌ర్‌తో లింకున్న అయిదు ప్రాంతాల‌ను త‌మ ప్ర‌భుత్వం డెవ‌ల‌ప్ చేస్తోంద‌న్నారు. చైత్య భూమి అభివృద్ధి అంశం కొన్ని దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. అయితే ఆ అంశాన్ని త‌మ ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించింద‌న్నారు. అక్క‌డికి వెళ్లి ప్రార్థ‌న చేసిన‌ట్లు మోదీ చెప్పారు. ఢిల్లీలోని అలీపూర్ రోడ్డులో అంబేద్క‌ర్ త‌న చివ‌రి రోజుల్ని గ‌డిపార‌ని, ఆ ప్రాంతాన్ని కూడా డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. లండ‌న్‌లో ఆయ‌న నివ‌సించిన ఇంటిని కూడా స్వాధీనం చేసుకుని డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు చెప్పారు. అంబేద్క‌ర్‌కు ఇచ్చే గౌర‌వం, మ‌ర్యాదలో లోటు లేద‌న్నారు.
25 కోట్ల మందిని పేద‌రికం నుంచి తొల‌గించామ‌న్నారు. ఎస్సీ, ఎస్టీ చ‌ట్టాన్ని బ‌లోపేతం చేశామ‌న్నారు. స్వ‌చ్ఛ భార‌త్‌, పీఎం ఆవాస్ యోజ‌న‌, జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌, ఉజ్వ‌ల్ యోజ‌న లాంటి త‌మ ప‌థ‌కాల‌న్నీ పేద‌, అణ‌గారిన ప్ర‌జ‌ల జీవితాల‌ను మార్చిన‌ట్లు వెల్ల‌డించారు.
కాంగ్రెస్ అస‌త్య ప్ర‌చారాలు
కాంగ్రెస్ పార్టీ అస‌త్య ప్ర‌చారాలు చేస్తోంద‌ని, ఆ పార్టీ అబ‌ద్దాల‌తో అంబేద్క‌ర్‌ను అవమానిస్తోంద‌ని, వాళ్లు చేసిన త‌ప్పుల్ని క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని మోదీ ఆరోపించారు. ద‌శాబ్ధాలుగా ఓ పార్టీ, ఓ కుటుంబం.. అన్ని ర‌కాలుగా అంబేద్క‌ర్ వార‌స‌త్వాన్ని, ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల‌ను నిర్వీర్యం చేసింద‌ని ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో విమ‌ర్శించారు.

Related Posts
స్ప్రింగ్ ఫెస్ట్ మళ్లీ వచ్చేసింది!
spring fest

స్ప్రింగ్ ఫెస్ట్ 66వ ఎడిషన్ జనవరి 24 నుండి జనవరి 26, 2025 వరకు జరగనుంది. స్ప్రింగ్ ఫెస్ట్ భారతీయ సాంకేతిక సంస్థ ఖరగ్‌పూర్ వార్షిక సాంస్కృతిక, Read more

హనీరోజ్‌పై లైంగిక వేధింపులతో వ్యాపారి అరెస్ట్‌
honey rose

ఇటీవల కాలంలో మహిళలపై లైంగిక వేధింపులు అధికం అవుతున్నాయి . తాజాగా సినిమా నటి హనీ రోజ్‌ ని లైంగికంగా వేధించిన కేసులో కేరళ కు చెందిన Read more

75వ రాజ్యాంగ వార్షికోత్సవం గురించి మోదీ ప్రసంగం – దేశ భవిష్యత్తు పై కీలక వ్యాఖ్యలు!
Maharashtra and Jharkhand assembly elections. PM Modis appeal to the voters

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 75వ రాజ్యాంగ వార్షికోత్సవం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో తన ప్రసంగంలో.. "ఈ పార్లమెంటు సెషన్ అత్యంత ప్రత్యేకమైనది. 75 సంవత్సరాల క్షేత్రంలో Read more

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *