rahul

రాహుల్‌గాంధీపై విచారణ

పార్లమెంటు ఆవరణలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య చోటుచేసుకున్న బాహాబాహీ ఘటనకు సంబంధించి.. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ప్రశ్నించనున్నట్లుగా ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎంపీల మధ్య తోపులాట కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడటం, రాహుల్‌గాంధీపై పార్లమెంటు స్ట్రీట్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేయటం తెలిసిన విషయమే. దీనిపై రాహుల్‌ మీద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు చేశారు. దీంట్లో భాగంగానే ప్రతిపక్షనేతను ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఒకరిపై ఒకరు కేసులు
ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. కాగా, రాహుల్‌పై నమోదైన కేసు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు బదిలీ అయింది. ఇదే ఘటనలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే గాయపడటంపై ఆ పార్టీ నేతలు బీజేపీ ఎంపీలపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోపులాట ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డులను పరిశీలించటానికి అనుమతించాలని పార్లమెంటు సెక్రటేరియట్‌ను పోలీసులు కోరే అవకాశం ఉందని తెలిసింది. కాగా, పార్లమెంటు ఘటన సందర్భంగా రాహుల్‌ తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్‌నాన్‌ కొన్యాక్‌ ఆరోపించిన నేపథ్యంలో మహిళా కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరింది. ఈ సంఘటనతో పార్లమెంట్ లో మరింత కట్టుదిట్టమైన భద్రతను పెంచారు.

Related Posts
యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి
యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి

కన్నడ చిత్రపరిశ్రమలో స్టార్‌గా ఎదిగిన యష్, తన పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో అభిమానులంతా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.యష్ పుట్టినరోజు: అభిమానులకు విజ్ఞప్తి, 'కేజీఎఫ్' ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా Read more

నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
Parliament sessions from today

న్యూఢిల్లీ: ఈరోజు ( సోమవారం )నుండి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. ఇవి ఏప్రిల్‌ 4వ తేదీ దాకా కొనసాగుతాయి. పలు శాఖలకు Read more

మణిపూర్ సీఎంని తొలగించండి : ప్రధానికి బీజేపీ ఎమ్మెల్యేలు లేఖ
Remove Manipur CM. BJP MLAs letter to Prime Minister

ఇంఫాల్ : మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ నేపథ్యంలో అధికార బీజేపీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బీరెన్ Read more

ఆప్‌ని ఓడించడమే మోడీ లక్ష్యం
narendra modi

ఏవిధంగానై ఢిల్లీ పీఠాన్నిఎక్కాలని మోడీ ప్రభుత్వం తహతహలాడుతున్నది. దానికోసం ముమ్మర కసరత్తులు చేస్తున్నది. 27 ఏళ్లుగా ఢిల్లీలో బీజేపీ అధికారానికి దూరంగా ఉంది. ఈ అధికార కరువును Read more