వేములవాడ : సంపన్నులను టార్గెట్ చేసి వలపు వల విసిరి బ్లాక్ మెయిల్ చేస్తూ పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న హోమ్ గార్డు వడ్ల అనూషను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు విచారణలో బయట పడింది.
రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ నుంచి 3 లక్షల 50 వేలు అప్పుగా తీసుకొని తిరిగి అడిగితే పెళ్లి చేసుకున్నట్లు మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి బ్లాక్ మెయిల్ చేసింది. మరోసారి 5 లక్షల డిమాండ్ చేయడం తో పరువు కోసం చెల్లించిన శేఖర్. మళ్ళీ డబ్బు డిమాండ్ చేయడంతో ఆయన చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనూష ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అనుష.