ap high court

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై అక్రమ కేసులను మోపుతున్నది. తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారంలో డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ ప్రభావతి వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో జిల్లా సెషన్స్ కోర్టు కూడా ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో రఘురామపై థర్డ్‌ డిగ్రీని ప్రయోగించిన కేసులో గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ముందుగా జిల్లా సెషన్స్‌కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ కోసం ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ప్రభావతి హైకోర్టులో పిటిషన్ వేశారు.

అయితే హైకోర్టుకు కూడా ప్రభావతి పిటిషన్‌ను కొట్టివేసింది. కస్టోడియల్ టార్చర్ అనంతరం సంబంధిత డాక్టర్లు రఘురామకు దెబ్బలు తగిలాయని నివేదికలు ఇచ్చారు. అయితే ప్రభావతి ఆ నివేదికను మార్చి.. ఆయనకు ఎటువంటి గాయాలు అవలేదని నివేదిక ఇచ్చారని పోలీసులు అభియోగం మోపారు.

ఈ కేసుకు సంబంధించి రఘురామ.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభావతి, విజయపాల్, తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటలిజెన్స్ బాస్‌గా ఉన్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వాళ్లు ముగ్గురు కూడా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు వెళ్లలేదు.

Related Posts
గుర్లలో డయేరియాపై నివేదిక
Diarrhea Disease in Viziana

విజయనగరం జిల్లాలో గుర్లలో తాగునీరు కలుషితం కావడం వల్ల డయేరియా వ్యాధి ప్రబలిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు వారు ప్రభుత్వం కోసం నివేదికను సిద్ధం Read more

ఆరవ రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు
WhatsApp Image 2024 11 11 at 10.56.56

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సభ ప్రారంభంలో ప్రశ్నోత్తరాల సెషన్ జరగనుంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో Read more

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
pawan manyam

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన రాజకీయ నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని హర్షించారు. 2018లో Read more

విశాఖ రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం
Big accident at Visakha rai

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. స్టేషన్‌లోకి వచ్చిన రైలు ఇంజిన్ హైటెన్షన్ విద్యుత్ తీగలు కొంతదూరం ఈడ్చుకెళ్లడం కారణంగా భారీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *