paadi photoshoot

యాదాద్రి ఫోటో షూట్ పై ఎమ్మెల్యే పాడి క్లారిటీ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తన సతీమణి శాలినితో కలిసి యాదాద్రి ఆలయంలో నిర్వహించిన ఫొటో షూట్ రాష్ట్రంలో వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. “యాదగిరి గుట్ట టెంపుల్ బయట ఫొటో షూట్ చేశాము. ఈవో అనుమతి తీసుకున్న తర్వాతే దీన్ని చేయడం జరిగిందన్నారు. కేసీఆర్ కట్టించిన యాదాద్రి టెంపుల్‌ను ప్రపంచానికి తెలియజేయాలనే మా ఉద్దేశ్యం అన్నారు.

ప్రభుత్వ పెద్దలు ముందు పాలనపై ఫోకస్ చేయాలి..కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటోంది? సీఎం రేవంత్ సహా మంత్రులు అయోమయంలో ఉన్నారు. సీఎం ఢిల్లీ, కేరళ టూర్లలో ఉన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కొరియాకు వెళ్లారు. టూర్‌ల మాదిరిగా, మంత్రి తుమ్మల మలేషియా టూర్ మీదే దృష్టి పెట్టారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెలికాఫ్టర్ కోసం గొడవ పడుతున్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదు. ప్రజలు అధికారం ఇచ్చింది దీనికోసమేనా? హామీలు అమలు చేయకపోతే, తెలంగాణ ప్రజలు సహించరు. తెలంగాణ పైసలు వయనాడ్‌కు హెలికాఫ్టర్‌లో తీసుకువెళ్లి ప్రియాంకా గాంధీకి ఇచ్చి వస్తున్నారని ఆరోపించారు.

Related Posts
తెలంగాణలో బీసీ వర్గాలకు మరో డిప్యూటీ సీఎం?
రేవంత్ కేబినెట్ లో మరో డిప్యూటీ సీఎం పదవి బీసీ వర్గాలకు ఇవ్వాలనే

తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీలు సంచలనంగా మారాయి. దీంతో, తాజా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశం Read more

అత్యుత్తమ వంటకాల్లో హైదరాబాద్ బిర్యానీ
HYD biryani

హైదరాబాద్ బిర్యానీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించింది. ప్రముఖ ఫుడ్, ట్రావెల్ గైడ్ టేస్టీ అట్లాస్ ఇటీవల ప్రకటించిన ప్రపంచ అత్యుత్తమ వంటకాల జాబితాలో హైదరాబాద్ బిర్యానీ Read more

కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది – భట్టి విక్రమార్క
bhatti budjet

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని Read more

డిసెంబ‌ర్ 9 నుండి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు
telangana assembly sessions

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9నుంచి మొదలుకాబోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుండటంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పధకాలు గురించి సభలో చర్చించే అవకాశం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *