కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు బెయిల్ పొడిగిస్తూ, ట్రయల్ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్ ను కర్ణాటక హైకోర్టు పొడిగించింది.
2024 ఫిబ్రవరిలో బెంగళూరు నివాసంలో తన 17 ఏళ్ల కూతురుని యడ్యూరప్ప వేధించారంటూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదయింది. ఫిర్యాదు చేసిన మహిళ గత ఏడాది మేలో ఊపిరితిత్తుల క్యాన్సర్ తో మరణించింది. కాగా యడ్యూరప్పను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని కోరుతూ బాధితురాలి సోదరుడు జూన్ లో హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ యడ్యూరప్ప దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
