Pawan Kalyan Dil Raju

మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు ఆర్థిక సాయం:పవన్, దిల్ రాజు

‘గేమ్ ఛేంజ‌ర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుగు ప్ర‌యాణంలో ప్ర‌మాద‌వశాత్తు మ‌ర‌ణించిన ఇద్దరు అభిమానుల‌కు నిర్మాత దిల్‌రాజు రూ.10 లక్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. శ‌నివారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ‘గేమ్ ఛేంజ‌ర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

ఆ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇళ్ల‌కు వెళుతున్న క్ర‌మంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్‌(22) మ‌ర‌ణించారు.ఇక ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంట‌నే నిర్మాత దిల్‌రాజు మీడియా స‌మ‌క్షంలో స్పందించారు.

ఆయ‌న మాట్లాడుతూ.. ” ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘ‌నంగా జ‌రిగింది. ఆ విష‌యంపై మేం సంతోషంగా ఉన్న స‌మ‌యంలో ఇలా ఇద్ద‌రు అభిమానులు తిరుగు ప్ర‌యాణంలో జ‌రిగిన ప్ర‌మాదంలో చ‌నిపోవ‌టం ఎంతో బాధాక‌రం. వారి కుటుంబాల‌కు నేను అండ‌గా ఉంటాను.

నా వంతుగా వారి కుటుంబాల‌కు చెరో రూ. 5 ల‌క్ష‌ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగ‌ల‌ను. వారికి నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను” అని అన్నారు.

Related Posts
జాట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.
జాట్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ పెద్ద మార్పు చూస్తున్నారు.సలార్, కల్కి, పుష్ప 2 లాంటి సినిమాలు బాలీవుడ్ సింగిల్ స్క్రీన్స్‌లోకి కొత్త జోష్ తీసుకువచ్చాయి.మన Read more

వైఎస్‌ విజయమ్మ లేఖపై స్పందించిన వైస్‌ఆర్‌సీపీ
YSRCP responded to YS Vijayamma letter

అమరావతి: జగన్-షర్మిల ఆస్తి వివాదంపై వైఎస్ విజయమ్మ నిన్న (మంగళవారం) బహిరంగ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ రోజు (బుధవారం) వైఎస్‌ఆర్‌సీపీ బహిరంగంగా Read more

Shahrukh Khan Tv Serial: బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ యాక్టింగ్ కెరీర్ టీవీ సీరియల్‌తోనే మొదలైంది. ఫౌజీ అనే టీవీ సీరియల్‌తో ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చాడు షారుఖ్‌ఖాన్‌.
Telefilms and TV shows that SRK was a part of

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్‌ తన నటనా ప్రయాణం టెలివిజన్‌ సీరియల్‌ ద్వారా మొదలుపెట్టిన విషయం చాలా మందికి తెలియదు ఆయన సినీ ప్రస్థానం 1989లో వచ్చిన "ఫౌజీ" Read more

ఏపీలో బాణసంచా ప్రమాదాలు… ముగ్గురి మృతి
Fireworks accidents in ap

ఆంధ్రప్రదేశ్‌లో రెండు వేర్వేరు చోట్ల జరిగిన బాణసంచా ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఏలూరులో జరిగిన ఘటనలో, బైక్‌పై టపాసులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *