telangana Assembly speaker

మూడు బిల్లుల‌కు శాస‌న‌స‌భ ఆమోదం

ఎలాంటి చ‌ర్చలకు తావు లేకుండానే మూడు బిల్లుల‌కు తెలంగాణ శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. విరామం అనంత‌రం ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ‌లో బీఆర్ఎస్, బీజేపీ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. ల‌గ‌చ‌ర్ల రైతుల‌ను విడుద‌ల చేయాల‌ని, ఈ అంశంపై చ‌ర్చ‌కు బీఆర్ఎస్, బీజేపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. కానీ స్పీక‌ర్ చ‌ర్చ‌కు అనుమ‌తించ‌లేదు. స‌భ్యుల ఆందోళ‌న‌ల మ‌ధ్య‌నే యంగ్ ఇండియా ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్, స్పోర్ట్స్ వ‌ర్సిటీ బిల్లు, విశ్వ‌విద్యాల‌యాల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ స‌వ‌ర‌ణ బిల్లుల‌ను సంబంధిత మంత్రులు స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.
చర్చలు లేకుండానే ఆమోదం
ఇక ఈ బిల్లుల‌పై ఎలాంటి చ‌ర్చ చేప‌ట్ట‌కుండా.. శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. మూడు బిల్లులకు ఆమోదం అనంత‌రం రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు.. ప‌ర్యాట‌క రంగంపై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ‌ను ప్రారంభించారు. అయితే ల‌గ‌చ‌ర్ల రైతుల‌ను త‌క్ష‌ణ‌మే జైలు నుంచి విడుద‌ల చేయాల‌ని బీఆర్ఎస్ స‌భ్యులు ఆందోళ‌న చేస్తున్నారు. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్యే శాసనసభ మూడు బిల్లులను ఆమోదించింది. రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఆ తర్వాత సభ రేపటికి వాయిదా పడింది.

Advertisements
Related Posts
క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్‌
క్షమాపణలు చెప్పిన హీరో విశ్వక్ సేన్‌

ఇటీవల కాలంలో సినిమా ఫంక్షన్స్‌లో రాజకీయా ప్రసంగాలు ఎక్కువైయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీని టార్గెట్ చేసుకుని పలువురు Read more

సీఎం రేవంత్ పై ఎర్రబెల్లి ఫైర్
errabelli

మాజీ మంత్రి , పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పై సీఎం రేవంత్ వరంగల్ సభలో ఘాటైన వ్యాఖ్యలు చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు. Read more

కుల గణన లో వివరాలు ఇవ్వని వారు ఇప్పటికైనా ఇవ్వవచ్చు – మంత్రి పొన్నం ప్రభాకర్
ponnam

కుల గణన ను ఉద్యమ కార్యక్రమం లా తీసుకొని పూర్తి చేశారు. కుల గణన నివేదిక ను క్యాబినెట్ సబ్ కమిటీ కి ఇచ్చింది. వివిధ అంశాలు Read more

ఉగాది నుంచే కొత్త రేషన్‌ కార్డుల జారీ !
New ration cards to be issued from Ugadi onwards!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపై అప్డేట్ ఇచ్చింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కొత్త Read more

Advertisements
×