Lokayukta notice to Chief Minister Siddaramaiah

ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు..

బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే, తనకు లోకాయుక్త పోలీసుల నుంచి నోటీసులు అందినట్టు సిద్ధరామయ్య కూడా వెల్లడించారు. అలాగే, నోటీసుల్లో పేర్కొన్నట్టుగా ఈ నెల 6వ తేదీన లోకాయుక్త ఎదుట హాజరవుతున్నట్టు చెప్పారు. ఇదే కేసులో ఆయన భార్య పార్వతిని గత నెల 25వ తేదీన విచారించిన విషయం తెల్సిందే.

కాగా, బుధవారం ఉదయం లోకాయుక్త ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇచ్చామని లోకాయుక్త సీనియర్ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు కొంత భూమిని కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో పోలీసులు సెప్టెంబరు 27వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ భూవివాదం ఇపుడు సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Related Posts
హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత
kavitha hsp

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరారు. వైద్య పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రానికి Read more

రైతులకు, ప్రజలకు తెలంగాణ సర్కార్ మరో అవకాశం
Telangana government is ano

తెలంగాణ సర్కార్ రాష్ట్ర ప్రజలకు , రైతులకు అందించే పలు పథకాల్లో భాగంగా మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, Read more

ఇండియా , యుకె మరియు యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా
BAFTA reveals nominees for Breakthrough 2024 across India UK and USA

న్యూఢిల్లీ: నెట్‌ఫ్లిక్స్ మద్దతుతో బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా), ఈ రోజు చలనచిత్రం, టెలివిజన్ మరియు గేమ్‌ల పరిశ్రమల నుండి తమ Read more

దారుణం.. బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్
Death certificate

మధ్యప్రదేశ్‌ జబల్పూర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఇంద్రజిత్ (66) అనే వృద్ధుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్యులు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *