encounter in chhattisgarh

మావోలకు మరో దెబ్బ.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంట‌ర్

ఇటీవల కాలంలో మావోలకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. పోలీసుల కాల్పుల్లో వరుసపెట్టి మావోలు కన్నుమూస్తున్నారు. తాజాగా ఈరోజు శనివారం బస్తర్ రీజన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో ఐదుగురు మావోలు మృతి చెందారు. భద్రతాబలగాల్లో కూడా ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరికి కాలిలో బుల్లెట్‌ దిగగా, మరొకరికి తలలోకి వెళ్లింది. అయితే ఇద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కంకేర్ నారాయణపూర్ జిల్లా సరిహద్దులోని మాద్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

Advertisements

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం నుంచి భద్రతాబలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. కాంకేర్ జిల్లా-నారాయణపూర్ జిల్లాల మధ్యనున్న ఉత్తర అంబుజ్‌మద్ ప్రాంతంలో మావోలు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్-స్పెషల్ టాస్క్ ఫోర్సు బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. దీంతో మావోయిస్టులకు- భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

Related Posts
అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో దాడి
Amritsar Golden Temple

పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేయడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు గాయపడగా, Read more

అస్సాంలో విదేశీయుల బహిష్కరణపై సుప్రీంకోర్టు ఆదేశాలు
మైనర్‌పై అత్యాచారం..40 ఏళ్ల కు కామాంధుడికి శిక్ష విధించిన సుప్రీం కోర్టు

అస్సాంలోని వివిధ రవాణా శిబిరాల్లో (ట్రాన్సిట్ క్యాంపులు) నిర్బంధించబడిన 270 మంది విదేశీయుల బహిష్కరణపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. కోర్టు ఇచ్చిన గత ఆదేశాలకు Read more

హెచ్-1బీ వీసాపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
భారత ప్రభుత్వంపై ఎక్స్ దావా: న్యాయపోరాటం ప్రారంభమా?

జనవరిలో అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణం చేయనున్న డొనాల్డ్ ట్రంప్ పాలనలో కీలక భాగస్వామి కాబోతున్న బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసాపై మరోసారి ఆసక్తికరమైన Read more

నేడు లిక్కర్ పాలసీ కేసు విచారణ.. హాజరుకానున్న కవిత
Liquor policy case hearing today. Kavitha to attend

హైదరాబాద్‌: ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట వర్చువల్‌గా ఈరోజు హాజరుకాబోతున్నారు. సీబీఐ Read more

×