ramana

మాతృభాషపై మమకారం ఉండాలి: జస్టిస్ ఎన్వీ రమణ

తెలుగు భాష వైభవం వల్లే తెలుగు రాష్ట్రాలకు కీర్తి ఉంటుంది అని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యన్.వి.రమణ పాల్గొని ప్రసంగించారు. తెలుగు భాష కీర్తి పతాకను ఎగుర వేసెలా సభలు నిర్వహిస్తున్న అందరికీ తెలుగు బిడ్డగా కృతజ్ఞతలు తెలియజేశారు.

తెలుగు జాతి అంటే మదరాసీలు కాదని తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారన్నారు. వంద బిలియన్లు మన తెలుగు భాషను మాట్లాడుతుంటారని.. తెలుగు ఉనికి అతి ప్రాచీన భాషగా గుర్తింపు పొందిందన్నారు. పురాణాలు, ఇతిహాసాలు దాటి ప్రజల భాషగా తెలుగు భాష మారిందన్నారు.
ప్రజా బాహిళ్యంలో మాతృభాషలోనే అన్ని నిర్ణయాలు ఉండాలి. ప్రభుత్వాలు కూడా తెలుగు భాషలోనే ఆదేశాల కాపీలు ‌ఇచ్చే ఆలోచన చేయాలి.
మాతృభాషలో విద్యాబోధన

కొన్ని దేశాల్లో వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అద్భుతాలు సాధించారని వెల్లడించారు. వారి సాంకేతికతను, విజయాలను వారి భాషలోనే రాసుకున్నాయన్నారు. భవిష్యత్తుతరాలకు మాతృభాషపై ఒక గౌరవం కలిగించాయన్నారు.

ఆ తరహాలో మన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. పెట్టుబడిదారులు ఇంగ్లీషు భాష ఉంటేనే ఉద్యోగాలు అనే పరిస్థితి కల్పించారు. తెలుగు భాషలో‌చదివి… దేశ విదేశాల్లో రాణిస్తున్న వారు ఎందరో. ప్రజా బాహిళ్యంలో మాతృభాషలోనే అన్ని నిర్ణయాలు ఉండాలి.

ఎన్టీఆర్ కే ఆ ఘనత

ఎన్టీఆర్ వంటి వారి వల్ల మన భాషకు, మన తెలుగు వాళ్లకు గౌరవం పెరిగిందన్నారు. మానవ బంధాలతో కూడిన రచనలే కలకాలం ప్రజల్లో నిలుస్తాయని.. కన్యాశుల్కం వంటి రచనలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. పత్రికలు, టీవీ ఛానళ్లు కూడా తెలుగు భాష అభివృద్ధి కోసం పాటుపడాలని.. లేదంటే భవిష్యత్తులో తెలుగు పేపర్లు, ఛానళ్లు చూసే పరిస్థితి ఉండదన్నారు.

Related Posts
నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే ఇలా చెయ్యండి – డీజీపీ గుప్తా
DGP gupta

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల భద్రత కోసం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ గుప్తా సూచించారు. నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు ఉందని అనిపిస్తే వెంటనే 100 Read more

ఫార్మసీ కంపెనీ లపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
mla anirudhreddy

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి, అరబిందో కంపెనీపై తీవ్ర విమర్శలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని పోలేపల్లి గ్రామానికి చెందిన స్థానిక రైతులు Read more

నేడు ఏపిలో ‘పల్లె పండుగ’ కార్యక్రమాని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం
pawan kalyan to participate in palle panduga in kankipadu

అమరావతి: గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలను Read more

మహిళల కోసం రూ.30 కోట్లు విడుదల చేసిన సర్కార్
Sarkar has released Rs.30 c

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు మరో తీపి కబురు అందిస్తూ, వడ్డీలేని రుణాల పై మిత్తి పైసలు విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *